టాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజగా ఉంది.

ఇక సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది అనసూయ.

సోషల్‌ మీడియాలో అనసూయ చేసే రచ్చ, వివాదాలు మాములుగా ఉండవు.

నిత్యం ఏదో ఓ కాంట్రవర్సిలో అనసూయ పేరు మారుమోగిపోవాల్సిందే.

ఇక అర్జున్‌ రెడ్డి సినిమా విడుదల ముందు నుంచి ఇప్పటి వరకు అనసూయకు, విజయ్‌ దేవరకొండ అభిమానులకు మధ్య.. అనేక సార్లు మాటల యుద్ధం నడిచింది.

లైగర్‌ సినిమా విడుదల తర్వాత అనసూయ చేసిన కామెంట్స్‌ ఎంతటి వివాదానికి దారి తీశాయో అందరికి తెలుసు.

కొన్ని రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. ఆఖరికి అనసూయ పోలీస్‌లను ఆశ్రయించింది.

ఆ వివాదం తర్వాత ఇన్ని రోజుల పాటు కామ్‌గా ఉన్న అనసూయ.. మరోసారి వార్తల్లో నిలిచింది.

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే

పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదలవుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు.

ఇక మే 9 విజయ్‌దేవరకొండ బర్త్‌డే సందర్భంగా ఖుషీ చిత్రం నుంచి మొదటి పాట రిలీజ్‌ చేస్తామని చిత్ర బృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది.

దీనిలో విజయ్‌ దేవరకొండ పేరు ముందు.. ది విజయ్‌ దేవరకొండ అని రాసి ఉంది.

సాధారణంగా యూనిక్‌ థింగ్స్‌కి ముందు మాత్రమే ది వాడతారు.

అలాంటిది విజయ్‌ దేవరకొండ తన పేరుకు ముందు ది ఉండటంపై అనసూయ కాస్త వెటకారంగా స్పందించింది.

ఇప్పుడే ఒకటి చూశాను.. ది(The) నా? బాబోయ్‌ పైత్యం.. ఏం చేస్తాం. అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్‌ చేసింది.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది. దీనిపై విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ అనసూయకు కౌంటర్లు ఇస్తున్నారు.