అమృత ప్రణయ్‌ మరో పెళ్లి చేసుకోబోతోందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆమె పెళ్లికి సిద్ధం అయిందని, ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని నెట్టింట వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

అయితే, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలింది.

అమృత ప్రణయ్‌ రెండో పెళ్లి చేసుకోవటం లేదు. సోషల్‌ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారం.

అమృత ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ ఛానల్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

‘అమృత ప్రణయ్‌’ అన్న ఛానల్‌కు 4 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.

అమృత తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో తన సబ్‌స్క్రైబర్స్‌కు తెలియజేస్తూ ఉంటారు.

 తాజాగా, తన ఫ్రెండ్‌ ఎంగేజ్‌మెంట్‌ కోసం తయారు అవుతున్న వీడియోను విడుదల చేశారు.

దీంతో జనం అమృతే రెండో పెళ్లి చేసుకోబోతోందని భావించి పోస్టులు చేయటం మొదలుపెట్టారు.

తర్వాత అసలు విషయం తెలిసి నాలుక కర్చుకుంటున్నారు.