ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బరువు తగ్గడానికి కూడా ఉసిరి బాగా సహాయపడుతుంది. 

ఉసిరి పుల్లగా, చేదుగా ఉండడం వల్ల తినేందుకు ఇష్టపడరు కొంతమంది. కానీ తింటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

ఉసిరికాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. 

ఉసిరికాయలో ఉండే పోషకాలు జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరుస్తాయి. 

ఉసిరికాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హైపర్ గ్లైసెమిక్, యాంటీ హైపర్ లిపిడెమిక్, హైపోగ్లైసెమిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

విటమిన్ సి, ఖనిజాలు, పాలీఫెనాల్స్, ఫైబర్, అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఉసిరి పచ్చడి, ఉసిరి పొడి, ఉసిరి రసం ఇలా రకరకాలుగా చేసుకుని తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఉదయాన్నే ఉసిరి రసం తీసుకుంటే మంచిది. 

ఉసిరికాయలను ముక్కలుగా కోసి కొంచెం ఉప్పు చల్లితే ఉసిరికాయల్లో ఉన్న పోషకాలు కోల్పోకుండా ఉంటాయి.

మార్కెట్లో ఉసిరి మిఠాయిలు దొరుకుతాయి. అవి తిన్నా కూడా మంచిదే.

ఉసిరికాయ రసంలో మిరియాల పొడి, నల్ల ఉప్పు కలుపుకుని తాగితే మంచిది. 

రసం తియ్యగా ఉండాలనుకునేవారు తేనె కలుపుకుని తాగవచ్చు.