ఒకప్పుడు పల్లెటూళ్లలో ఎక్కువగా నిలుక మంచాలు ఉండేవి.

వాటిపై నిద్రపోగానే ఇట్టే నిద్రపట్టేది. అది కూడా గాఢ నిద్ర పట్టేది.

రోజులు మారాయి. టెక్నాలజీ పెరిగి ప్లాస్టిక్‌ వాడకం ఎక్కువయిపోయింది.

ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ నవారు మంచాలు దర్శనమిస్తున్నాయి. నులక మంచాలను జనాలు మర్చిపోయారు.

ఇలాంటి సమయంలో ఓ అమెరికన్‌ కంపెనీ నులక మంచాలను అమ్మకానికి పెట్టింది.

అది కూడా భారత దేశానికి చెందిన నులక మంచాలను అమ్మకానికి పెట్టింది.

ఆ ఒక్కో నులక మంచం రేటు 1320 డాలర్లుగా ఉంది.

అదే ఇండియన్‌ కరెన్సీలో అయితే లక్ష రూపాలయకు పైమాటే.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.