ఎన్‌ఎంసీసీ.. గత నాలుగైదు రోజులుగా ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మోగి పోతుంది.

దేశంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం కోసం ముఖేష్‌ అంబానీ ఓ వినూత్న ఆలోచన చేశాడు.

దానిలో భాగంగా తన భార్య నీతా అంబానీపేరు మీద ముంబైలో ఓ భవనాన్ని నిర్మించాడు.

నీతా ముఖేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (ఎన్‌ఎంసీసీ) పేరిట ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ భవనాన్ని నిర్మించాడు.

అత్యంత విశాలంగా, ఎంతో సుందరంగా సర్వ హంగులతో నిర్మించిన ఈ భవనాన్ని మార్చి 31 న​ ప్రారంభించారు.

రెండు రోజుల పాటు ఎంతో ఘనంగా, అట్టహసంగా ఈ వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం సినీ, రాజకీయ, క్రీడా లోకానికి చెందిన సెలబ్రిటీలు తరలి వచ్చారు.

రకరకాల కార్యక్రమాలతో.. ఎంతో ఘనంగా ఎన్‌ఎంసీసీ ఒపెనింగ్‌ సెర్మనీ నిర్వహించారు.

ఈ వేడుకకు తరలి వచ్చిన అతిథులకు నోరూరించే, అద్భుతమైన విందు ఏర్పాటు చేశారు.

వెండి కంచాల్లో.. రకరకాల నోరూరించే వెజిటిరియన్‌ వంటకాలను వడ్డించారు.

అయితే అన్నింటికి మించి ఒక డిష్‌ అందరిని ఆకట్టుకోవడమే కాక.. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఫొటోలో ఉన్న డిష్‌ ఒక స్వీట్‌. పేరు దౌలత్‌కి చాట్. చూడ్డానికి హల్వాలా ఉంది.

ఉత్తరాదిలో సర్వసాధారణంగా కనిపించే స్వీట్‌. మరి దీనిలో అంత ప్రత్యేకత ఏం ఉంది అంటే..

ఈ స్వీట్‌ని మట్టి పాత్రలో.. ఆకులో వడ్డించారు. ఇక పాత్రలో ఓ పక్క ఐదు వందల రూపాయల నోట్లతో అలంకరించారు.

దాంతో ఈ స్వీట్‌ టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట కూడా వైరల్‌ అయ్యాయి.

ఇది చూసిన నెటిజనులు.. ఎంతైనా అంబానీ ఇంట ఫంక్షన్‌ కదా.. ఆ మాత్రం ఉంటుంది అని కామెంట్స్‌ చేశారు.

మరి కొందరు మాత్రం.. ఎంత ధనవంతులు అయితే మాత్రం.. ఇలా డబ్బులను వడ్డిస్తారా అని మండి పడుతున్నారు.

అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. అవి నిజం డబ్బులు కాదు. జీరాక్స్‌ కాయితాలు.

అయితే చూడ్డానికి మాత్రం నిజంగా ఐదు వందల రూపాలయ నోట్లతో గార్నిష్‌ చేశారా ఏంటి అన్నట్లుగా ఉంది.

ఇక ఈ వేడుకలో పాల్గొనడానికి రజనీకాంత్‌, సచిన్‌ దంపతులు, ఐశ్వర్య దంపతులు, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ జోడి, ప్రియాంక దంపతులు తరలి వచ్చారు.