ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే మన పెద్దవారు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు.
ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే మన పెద్దవారు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు.
అందుకే ఉల్లిపాయలను అనాదిగా వంటింట్లో భాగం చేశారు మన పూర్వీకులు.
ఇక ఉల్లిపాయలు ఔషధాల గని అనే చెప్పుకోవాలి.
ఇందులో విటమిన్ బి6, బి12, విటమిన్ సి, కె, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.
ఉల్లిపాయలను రోజూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిని ప్రతీ రోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని చెక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి.
దాంతో టైప్2 మధుమేహం నివారించబడుతుంది.
బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, త్వరగా బరువును తగ్గించడంలో ఉల్లి ఎంతో మేలు చేస్తుంది.
బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు రోజూ 100 గ్రా. ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ముక్కు నుంచి రక్తం కారుతుంటే ఉల్లి ముక్క వాసన చూస్తే రక్తం కారడం తగ్గుతుంది.
పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడానికి ఉల్లి ఎంతగానో తోడ్పడుతుంది.
పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడానికి ఉల్లి ఎంతగానో తోడ్పడుతుంది.
అర కప్పు ఉల్లి రసంలో 3 టేబుల్ స్ఫూన్ల తేనెను కలిపి రోజుకు రెండు పూటాలా తాగడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
రెండు తెల్ల ఉలిపాయలను తరిగి నీటిలో వేసి కొద్దిసేపు మరిగించాలి. తరువాత ఆ నీటిని వడకట్టి తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది.
నోట్: పై చిట్కాలను పాటించే ముందు దగ్గర్లోని డాక్టర్ల, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి.