పన్నీరులో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. అవి ఎక్కువ శక్తినిస్తాయి.

పన్నీరులో ఉండే ఫాస్ఫరస్, ఫాస్ఫేట్ లు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. 

పాల ఉత్పత్తి అయిన పన్నీర్ లో కాల్షియం, విటమిన్ డి రొమ్ము క్యాన్సర్ ను దూరం చేసేందుకు దోహదం చేస్తాయి. 

పన్నీరు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గుండెకు ఇది ఎంతో మంచిది.

పన్నీరులో ఉండే మెగ్నీషియం క్యాటలిస్టులా పని చేస్తుంది. జీవ రసాయనిక చర్యల్ని సపోర్ట్ చేస్తుంది.

శరీరంలోని వివిధ రకాల ఎంజైములను ఈ పన్నీరు యాక్టివేట్ చేస్తుంది.

పన్నీరు ఎముకలకు బలాన్ని ఇస్తుంది. కండరాలు మరియు నాడుల పనితీరును మెరుగుపరుస్తుంది.

మనకి రోజూ అవసరమయ్యే కాల్షియంలో 8% ఈ పన్నీరు ద్వారా లభిస్తుంది. ఈ కాల్షియం ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది.

గర్భవతులు ఈ పన్నీరు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 

పన్నీరు రేచీకటిని నిరోధించి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పన్నీరులో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జీర్ణక్రియకు, షుగర్ ని కంట్రోల్ చేయడానికి, టెన్షన్ నుంచి బయటపడడానికి దోహదపడుతుంది.

పన్నీరు ఆకలి లేకపోవడాన్ని నియంత్రిస్తుంది.

ప్రొస్టేట్ రుగ్మతలను పోగొట్టి, వివిధ రకాల అంటువ్యాధులపై పోరాడుతుంది. 

డైలీ పన్నీరు తింటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువని నిపుణులు చెబుతున్నారు. 

పన్నీరులో సెలీనియం ఉంటుంది. అలాంటి పన్నీరుని వంటల్లో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా ఉంటాయి. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.