మ‌నం రోజూ వంట‌ల్లో జీల‌క‌ర్రన, ధనియాలు  వాడుతుంటాము.

జీలకర్ర, ధనియాల వల్ల వంటలకు చక్కటి వాసన, రుచి వస్తుంది.

వీటి మిశ్రమం వంటల్లో రుచినే ఇవ్వడమే కాక మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

అంతే కాక ఉద‌యాన్నే జీల‌క‌ర్ర నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 

ఈ జీల‌క‌ర్ర నీటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని వేడిచేసి.. అందులో రెండు టీ స్పూన్ల జీల‌క‌ర్రను వేసి మ‌రిగించాలి.

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఈ జీల‌క‌ర్ర నీటిని తాగడం వ‌ల్ల జీర్ణాశ‌యం శుభ్రప‌డుతుంది.

ఈ జీలకర్ర పానీయంతో పాటు, అందులో మరికొన్ని కలిపి కొత్త పానీయం తయారు చేసుకవచ్చు.

 జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలతో తయారు చేసిన పానీయం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఈ మిశ్రమ రోజూ ఉద‌యాన్నే తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో కొవ్వు తొల‌గిపోతుంది.

జీలకర్ర, ధనియాల మిశ్రమ పానీయం తీసుకోవడం వల్ల శ‌రీరం నుండి వ్యర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల చర్మం ముడపడకుండా య‌వ్వనంగా క‌నిపిస్తారు. 

ఈ మిశ్రమ పానీయం తీసుకోవడం వల్ల క‌ళ్ల చుట్టూ ఉండే న‌ల్లటి వ‌ల‌యాలు తొల‌గిపోతాయి. 

జీల‌క‌ర్ర నీరు, జీలకర్ర,ధనియాల మిశ్రమ నీరు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు అంటున్నారు. 

వీటిని త‌ప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాల‌ని నిపుణులు  సూచిస్తున్నారు.