మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తిన్నప్పుడు బలమైన పోషకాహారం మారుతుంది. 

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. 

మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్స్, విటమిన్స్, బెల్లంలో ఐరన్,  కాల్షియం మెండుగా ఉంటాయి.

మనకు ఎర్రరక్త కణాలు  తగ్గడం వలన ఎనీమియా బారిన పడతాం.

ఎనీమియాతో బాధపడే వారికి మొలకెత్తిన శనగలు, బెల్లం  తీసుకోవడం చక్కటి పరిష్కారం

ఈ రెండింటిని కలిపి తినడం వలన హిమోగ్లొబిన్ శాతం పెరుగుతుంది

వీటిలోని కాల్షియం ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా చేస్తాయి.

మొలకెత్తిన శనగలు, బెల్లం తినడం వలన గుండె సమస్యలు దరి చేరవు

మొలకెత్తిన శనగలు, బెల్లం తినడం వలన బీపీ అదుపులో ఉంటుంది.

మొలకెత్తిన శనగల్లోని ఫైబర్  అజీర్తి సమస్యలను దూరం చేసి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది

మొలకెత్తిన శనగలు, బెల్లం తినడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు.

ఈ రెండు మెదడు కార్యాచరణను మెరుగుపరచి జ్ణాపకశక్తి సమస్యలు ఏమి లేకుండా చేస్తాయి.

మొలకెత్తిన గింజలు, బెల్లం తినడం వలన మలబద్దక సమస్య పోతుంది.

ఇలా మొలకెత్తిన శనగలు, బెల్లం తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.