శ‌రీరానికి శక్తివంతమైన పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి.

అధికమెత్తంలో శక్తినిస్తుంది కాబట్టి.. బాదం పప్పును కింగ్ ఆఫ్ న‌ట్స్ అని పిలుస్తారు.

అయితే బాదంను తేనెతో క‌లిపి తీసుకుంటే ఎన్నో అద్భతమైన ప్రయోజ‌నాల‌ను ఉన్నాయి.

బాదంను తేనెతో తీసుకోవడం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్రయోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌రీరంలోని చెడు కొవ్వును త‌గ్గించ‌డంలో తేనెతో ఉండే బాదం పప్పు  ఉపయోగపడుతుంది.

త‌ర‌చూ ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు బాదం ప‌ప్పును తిన‌డం మంచిది.

బాదం, తేనె క‌లిపి తీసుకుంటే ఆలోచ‌న శ‌క్తి, జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతాయి.

బాదంను తేనెలో నాన‌బెట్టుకుని తిన‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది

బాదం, తేనె క‌లిపి తీసుకుంటే దంప‌తుల్లో సంతాన స‌మ‌స్యల‌ను సైతం నివారిస్తుంది

బాదం ప‌ప్పును తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి పెరిగి రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటారు. 

బాదం పప్పు తినడం వలన బ్రెస్ట్ క్యాన్సర్‌ వంటి అనేక రకాల క్యాన్సర్లు ద‌రి చేర‌కుండా ఉంటాయి

బాదం ప‌ప్పుల‌ను తేనెలో నాన‌బెట్టి తింటే మాసిక స‌మ‌స్యలు ప‌రార్ అవుతాయి.

బాదం ప‌ప్పును తినడం వ‌ల్ల మ‌ల‌బ‌ద్దకం,అజీర్తి వంటి స‌మ‌స్యలు ఉండవు.

 అయితే మ‌ధుమేహం ఉన్న వారు మాత్రం బాదంతో తేనెను క‌లిపి తీసుకోక‌పోవ‌డ‌మే ఉత్తమం.

ఈ విధంగా బాదంప‌ప్పు వ‌ల్ల మ‌నకు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.