వేసవి కాలంలో అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మి వల్ల అనేక వ్యాధులు వస్తుంటాయి.
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్, షరబత్ వంటివి తాగుతుంటారు.
సబ్జా గింజల పానీయంతో వేసవి తాపాన్ని తగ్గించుకోచ్చు.
ఒంట్లో అధిక వేడి ఉంటే.. సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది.
అధిక బరువు, షుగర్, మలబద్ధకం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులకు సబ్జా గింజల పానియం ఎంతో చక్కగా పనిచేస్తుంది.
ప్రతిరోజూ ఒక గ్లాస్ సబ్జా గింజట పానియం తాగితే వికారంగా, వాంతి వచ్చే అవకాశం ఉండదు.
సబ్జా గింజలతో గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు
సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను తగ్గించుకోవచ్చు
సబ్జా గింజల పానీయం పిల్లలకు తాగిస్తే మంచిది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరి చేరవు
ప్రతిరోజూ సబ్జా గింజల పానీయం తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.
తరుచూ డీహైడ్రేషన్కు గురయ్యే వారు గ్లాసు సబ్జా గింజల నీరు తాగితే ఎంతో ఉపశమనం
సబ్జా గింజల పానియం తాగితే.. మహిళలకు విటమిన్ ఇ, ఫోలేట్, నియాసిన్ వంటి పోషకాలు లభిస్తాయి.
సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి.