చమురు ధరలు చుక్కలు చూపిస్తుండడంతో.. ప్రజలు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలో కరెంట్ తో పని లేకుండా.. ఛార్జింగ్ అవసరం లేని బ్యాటరీ వాహనాలు వస్తే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా?
అయితే మీ కోసమే ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీతో రానున్న వాహనాలు.
భద్రత, వాతావరణ కాలుష్యం లేకుండా.. ఛార్జింగ్ తో పని లేకుండా సరికొత్త బ్యాటరీలను తయారు చేస్తున్నారు.
ఖాళీ గ్యాస్ సిలిండర్ ఇచ్చి కొత్త సిలిండర్ తీసుకున్నట్టు.. ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే.. దీన్ని పెట్రోల్ బంకుల్లో, బ్యాటరీ అవుట్ లెట్స్ లో ఇచ్చి కొత్త బ్యాటరీ తీసుకెళ్లవచ్చు.
లిథియం బ్యాటరీతో పోలిస్తే ఇది సురక్షితం మరియు మైలేజ్ కూడా అధికంగా ఉంటుంది.
ఒక అల్యూమినియం బ్యాటరీతో 500 కి.మీ. ప్రయాణం చేసే సామర్థ్యంతో బ్యాటరీని రూపొందిస్తున్నారు.
అల్యూమినియం బ్యాటరీల తయారీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇజ్రాయెల్ కు చెందిన ఫినర్జీ కంపెనీలు సంయుక్తంగా పని చేస్తున్నాయి.
ఇక ఈ బ్యాటరీలని అమర్చేందుకు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.