సాధారణంగా ఇళ్లలో ఉండే కలబంద గురించి అందరికీ తెలిసే ఉంటుంది

కలబందను వాడుకలో దాని ఆంగ్ల నామకరణం 'అలోవెరా' అని కూడా అంటుంటారు

కలబందతో మనుషుల అందానికి, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

మరి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నప్పుడు క‌ల‌బంద‌ను ఉపయోగించాలో చూద్దాం

క‌ల‌బంద ఇంట్లోకి వైర‌స్, బాక్టీరియాల ఇన్ ఫెక్ష‌న్లు రాకుండా చేస్తుందట

పిల్ల‌లు ఉన్న ఇంట్లో క‌ల‌బంద మొక్క ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు

క‌ల‌బంద గుజ్జులో విట‌మిన్ సి, ఎ, ఇ, బి12 ల‌తో పాటు కాల్షియం, జింక్, సోడియం లాంటి మిన‌ర‌ల్స్ ఉంటాయి

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో 30ml క‌ల‌బంద గుజ్జును వేసి క‌లిపి తాగ‌డం చాలా మంచిది

అలా తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధిని నియంత్రించవచ్చని, రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు

క‌ల‌బంద గుజ్జును తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ తగ్గి, బరువు తగ్గవచ్చు

జీర్ణ వ్య‌వ‌స్థ‌ మెరుగుప‌డి అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి 

క‌ల‌బంద గుజ్జుతో పళ్ళు కూడా తోముకోవచ్చు. ఇలా చేస్తే దంతాల స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి

క‌ల‌బంద గుజ్జుకు మోకాళ్ల నొప్పులు త‌గ్గించే గుణం ఉంది. గుజ్జులో ఆవనూనె క‌లిపి మ‌ర్ద‌నా చేస్తే మోకాళ్ల నొప్పులు పోతాయి

క‌ల‌బంద గుజ్జులో పెరుగును క‌లిపి జుట్టు కుదుళ్ల‌కు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి

కొంద‌రిలో క‌ల‌బంద‌ వ‌ల్ల ఎల‌ర్జీలు వచ్చే అవ‌కాశం ఉంటుంది. కాబట్టి మొద‌ట‌ కొద్ది మోతాదులో ఉప‌యోగించాలని ఆయుర్వేద నిపుణులు సలహా