మద్యం సేవించాలంటే ఇళ్లు, బార్, రెస్టారెంట్, పబ్‌లు ఇలా వేర్వేరు ప్రాంతాలు ఉంటాయి.
ఇక విదేశాల్లో అయితే ఆఫీస్‌లో కూడా మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది.
అక్కడి పద్దతులు వేరు, వాతావరణం, అలవాట్లు వేరుగా ఉంటాయి.
మన దేశంలో అయితే మద్యం సేవించడం ఇప్పటికి నేరంగానే చూస్తారు కొందరు.
ఇక మద్యపానం వల్ల ఎలాంటి ప్రమాదాలు, దారుణాలు, నేరాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మద్యపాన నిషేధం అనేది మన దేశంలో పూర్తిగా ఆచరణలోకి రావడం కల్ల.
ఇప్పటికే మన దేశంలో లెక్కకు మించి బెల్ట్ షాప్‌లు, వైన్స్‌లకు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.
ఇవి చాలవన్నట్లు ఊర్లలో కూడా కిరాణా దుకాణాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముతుంటారు.
ఇలాంటి వాటిని నివారించాల్సిన ప్రభుత్వాలు.. మందుబాబులకు అనుకూలంగా ఉండే నియమాలను తీసుకువస్తున్నాయి.
తాజాగా హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఆఫీసుల్లో కూడా మద్యం సేవించేందుకు అనుమతులిచ్చింది.
2023-24 వ సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక మీదట కార్పొరేట్ ఆఫీసు క్యాంటీన్లలో మద్యం తాగడానికి అనుమతి ఇచ్చింది హర్యానా ప్రభుత్వం.
కార్పొరేట్ ఆఫీస్ క్యాంటీన్‌లలో ఆల్కహాల్ శాతం తక్కువ ఉన్న బీరు వైన్, వంటి డ్రింక్స్‌ను తాగేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ జూన్ 12 నుంచి అమల్లోకి రానుంది.
అయితే ఈ రూల్ ఎలాంటి కంపెనీలకు వర్తిసుంది అంటే..
ఆ కార్యాలయంలో సుమారు 5వేల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండాలి.
ఆఫీస్ విస్తీర్ణం కూడా లక్ష చదరపు అడుగులకు పైబడి ఉండాలనే షరతులు పెట్టింది ప్రభుత్వం.
ఇవి ఫాలో అయ్యే కంపెనీల క్యాంటీన్లలో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.