రెండ్రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.

చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వానలకు ఆ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

ఈ వరదల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లో పలు చోట్ల కొండ చరియాలు విరిగిపడుతున్నాయి.

దీంతో నడకదారి మార్గాలైన అలిపిరి, శ్రీవారి మెట్లను తితిదే అధికారులు తాత్కాలికంగా మూసేశారు.

ఈ రెండు రోజుల్లో కురిసిన వర్షలకు శ్రీవారి మెట్ల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. 

పెద్ద పెద్ద బండరాళ్లు దారికి అడ్డంగా పడ్డాయి.

కొండల్లోని చెత్త చెదారం, మట్టి మెట్ల మార్గంపై  పేరుకుపోయింది.

భారీ వర్షాలు, వరదలతో తిరుపతి నగరం అతలాకుతలం అవుతోంది. 

తిరుపతిలో..  రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

వరద ప్రవాహ తీవ్రత కారణంగా.. ఆటోలు, బైకులు కొట్టుకుపోయాయి.

తిరుపతిలోని పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.

తిరుచానూరులోని వసుంధర నగర్ లో ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది.