మద్యం తాగడం మంచిదా? అంటే టక్కున మంచిది కాదని అంటారు. 

కానీ తాగే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం నుంచి మనం తప్పించుకుంటామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మితమైన మద్యపానం వల్ల ఒత్తిడి తగ్గి, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

ఇష్టమైన ఆహారంతో పాటు మద్యం తీసుకోవడం వల్ల జీవితకాలం కూడా పెరుగుతుందట.

ఒకవేళ ఎక్కువ తాగితే మాత్రం మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ వైఫల్యం లాంటి సమస్యలు తప్పవు.

వారానికి ఓసారి తాగడం మీ ఆరోగ్యం కోసం మీరు చేయగలిగే గొప్పపని.

వైన్ పై కేలరీల మొత్తాన్ని చూడండి. అనారోగ్యకర కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర స్థాయిలు తక్కువ ఉన్నవి తాగండి.

ఖాళీ కడుపుతో తాగితే వాంతులు, తలనొప్పి లాంటి సమస్యలొస్తాయి. అందుకే ఆల్కహాల్ కంటే ముందు హెల్తీ ఫుడ్ తినండి.

కొన్నిసార్లు కాక్ టైల్స్ వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంది. ఆల్కహాల్‌తో కూల్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిది. 

ఒకవేళ మద్యం తాగాలని అనుకుంటే దానికంటే ముందు బాగా నీరు తాగడం మర్చిపోకండి. 

ఆల్కహాల్‌తో జంక్ ఫుడ్ తినకూడదు. ఆల్కహాల్ ఎక్కువ కేలరీలు, దానితో పాటు అధిక కొవ్వు ఉంటే శరీరంపై ప్రభావం పడుతుంది.

నిపుణుల చెప్పిన దానిబట్టి ఆల్కహాల్ తక్కువ తీసుకోవడమే మంచిది. లిమిట్​ దాటితే ఆరోగ్య సమస్యలు తప్పవు.