అక్షయ తృతీయ నాడు అంటే హిందువులకు ఎంతో ఇష్టమైన పండుగ.
ఈరోజున విలువైన వస్తువులు ఏవి కొన్నా అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతాయని నమ్ముతారు.
ముఖ్యంగా బంగారం కొనుగోలు చేస్తే శుభం చేకూరుతుందని, ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు.
అక్షయం అంటే తరగనిది, చిరకాలం ఉండేది అని అర్థం.
అందుకే ఏది ఏమైనా గానీ ఈరోజున బంగారం కొనాల్సిందే అని భీష్మించుకుని కూర్చుంటారు.
డబ్బు లేకపోయినా గానీ అప్పు చేసి కొనేవారు కూడా ఉంటారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు కొంటాం అని అనుకుంటారు.
బంగారం విలువ పెరుగుతుందే గానీ తరగదు అన్న నమ్మకంతో అప్పు చేసి కొంటారు.
కొంతమంది తమ స్థాయికి తగ్గట్టు తక్కువైనా గానీ బంగారం కొనాలని ప్రయత్నం చేస్తారు.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం సరే.. ముహూర్తం చూసుకున్నారా? లేదా?
ఒకవేళ మీరు ముహూర్తాన్ని నమ్మితే గనుక ఈ సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
ఏప్రిల్ 22 శనివారం ఉదయం 7:49 గంటల నుంచి మరుసటి రోజు అనగా ఏప్రిల్ 23 ఆదివారం ఉదయం 7:47 గంటల వరకూ మంచి సమయంగా చెబుతున్నారు.
ఈ 24 గంటల్లో ఏ సమయంలో కొన్నా గానీ మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.