గత కొన్నాళ్లుగా మన దగ్గర కూడా అక్షయ తృతీయ నాడు బంగారం కొనే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

సాధారణంగా మన దగ్గర వరలక్ష్మి వ్రతం, దీపావళి పండుగ రోజుల్లో బంగారం కొనుగోలు చేస్తారు.

కానీ గత కొన్నాళ్లుగా ధన్‌తెరాస్‌, అక్షయ తృతీయ రోజున కూడా బంగారం కొంటున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని.. వినియోగదారులను ఆకర్షించడం కోసం జ్యువెలరీ స్టోర్‌లు భారీ ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి.

ఫ్రీ గోల్డ్‌ కాయిన్‌, మేకింగ్‌ ఛార్జీలపై భారీ తగ్గింపు వంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

అక్షయ తృతీయ సందర్భంగా తనిష్క్‌.. భారీ ఆఫర్‌ ప్రకటించింది.

అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా వినియోగదారులకు.. గోల్డ్‌, డైమండ్‌ ఆభరణాల మేకింగ్‌ ఛార్జీలపై 25 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది.

ఇక ఈ ఆఫర్‌ ఏప్రిల్‌14-24 వరకు ఉంటుంది.

దీనిలో భాగంగా.. 3 లక్షల రూపాయల వరకు కొనుగోలు చేసే బంగారు ఆభరణాల మేకింగ్‌ ఛార్జీలపై 10 శాతం తగ్గింపు ప్రకటించింది.

 ఆ తర్వాత 3-7 లక్షల వరకు కొనుగోళ్లపై 15 శాతం, 7-15 లక్షల కొనుగోళ్లు వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది.

20 శాతం, 15 లక్షల రూపాయలు ఆపై కొనుగోళ్ల మీద మేకింగ్‌ ఛార్జీల మీద ఏకంగా 25 శాతం మేర తగ్గింపు ఇవ్వనుంది.

ఇక అక్షయ తృతీయ సందర్భంగా మలబాలర్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ బంపరాఫర్‌ ప్రకటించింది.

 30 వేల రూపాయలు ఆపై ఖరీదైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే.. వినియోగదారులకు 100 మిల్లీ గ్రాముల బంగారు నాణేం ఫ్రీగా ఇవ్వనున్నారు.

 ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 30 వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.

అలానే మరో ప్రముఖ జ్యువెలరీ స్టోర్‌ సెన్కో గోల్డ్‌ అక్షయ తృతీయ సందర్భంగా మేకింగ్‌ ఛార్జీల మీద 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది.

అలానే బ్రాండ్‌ కస్టమర్లకు వజ్రాభరణాలపై 12 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

అలానే పాత ఆభరణాలు ఇచ్చి కొత్త నగలు కొనుగోలు చేస్తే.. దానిపై 0 శాతం తగ్గింపు రుసుము వసూలు చేస్తామని సెన్కో జ్యువెలరీ ప్రకటించింది.

మరో జ్యువెలరీ స్టోర్‌ పీసీ చంద్ర బంగారు ఆభరణాల దుకాణం కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.

అన్ని రకాల ఆభరణాల మేకింగ్‌ ఛార్జీలపై 15 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.

అలానే వజ్రాలు, ఖరీదైన రాళ్ల ఆభరణాల కొనుగోలుపై 10 శాతం వరకు తగ్గింపు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 15-23 వరకు అందుబాటులో ఉంటుంది.