దేశ ప్రధానికి జనాలు ఇచ్చే గౌరవ మర్యాదలు అంతా ఇంతా కాదు. 

వారి కుటుంబీకులకు కూడా ప్రజల్లో ఆదరాభిమానాలు ఒక రేంజ్ లో ఉంటాయి.

ప్రధాని స్థాయి ఉన్న వ్యక్తుల జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ప్రజల్లో ఉండటం సాధారణమే.

ఇకపోతే, బ్రిటన్​ ప్రధానిగా రిషి సునక్​ బాధ్యతలు తీసుకున్నప్పుడు భారతీయులు అందరూ గర్వంతో ఉప్పొంగిపోయారు. 

ఇండియా సంతతి వ్యక్తి సునాక్.. బ్రిటన్​ను పాలించడం ఏంటని ఒకింత ఆశ్చర్యపోతూనే ఆనందంలో మునిగితేలారు.

రిషి సునాక్​కు యూకేలో ఎంత పాపులారిటీ ఉందో ఆయన భార్య అక్షతా మూర్తికి భారత్​లో అంతే క్రేజ్ ఉంది. 

ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అయిన నారాయణ మూర్తి కూతురైన అక్షత ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో పైకి ఎదిగారు. 

తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి తనదైన మార్గంలో నడుస్తూ ఈస్థాయికి చేరుకున్నారు అక్షత. 

యూఎస్​లో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న అక్షత.. అక్కడే కొన్నాళ్లు జాబ్ చేశారు. 

అనంతరం ఇన్ఫోసిస్​లో మార్కెటింగ్ మేనేజర్​గా బాధ్యతలు తీసుకున్నారు. 

2014వ సంవత్సరంలో కాటమరాన్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు అక్షత.

బిజినెస్​తో ఎంత బిజీగా ఉన్నా సామాజిక సేవను కొనసాగిస్తూనే ఉన్నారు అక్షతా మూర్తి. తన పేరు మీదే ‘అక్షతా ఫౌండేషన్​’ను ఆమె నెలకొల్పారు.

విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆమె కృషి చేస్తున్నారు. 

అలాంటి అక్షతా మూర్తికి భారీ నష్టం వాటిల్లింది. ఆమె ఒక్కరోజులోనే రూ.500 కోట్ల వరకు నష్టపోయారు. 

భారత స్టాక్ మార్కెట్లలో సోమవారం ఐటీ రంగం కుదేలైంది. ఇన్ఫోసిస్​ సంస్థ షేర్ కూడా భారీగా పడిపోయింది. దీంతో అక్షతాకు నష్టాలు తప్పలేదు.