నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆత్రుతుగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అఖండ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ: గజేంద్ర అనే ఓ నీచుడు పీఠాధిపతిని హత్య చేసి.., తనని తాను భగవంతుడిగా ప్రకటించుకుంటాడు. అతని అంతం కోసం పరమ శివుని అంశలో జన్మించిన బిడ్డే అఖండ ( బాలకృష్ణ) .
అఖండ పుట్టగానే కన్న వారికి దూరం అయిపోయి కాశీలో అఘోరాగా జీవిస్తాడు. అతనితో పాటు పుట్టిన అతని సోదరుడు మురళీకృష్ణ ( బాలకృష్ణ) మంచి పనులు చేస్తూ..,
అనంతపురంలో ప్రజలకి అండగా ఉంటాడు. మురళీకృష్ణ రైతు మాత్రమే కాదు, ప్రకృతిని ప్రేమించే వ్యక్తి కూడా.
ఈ క్రమంలో ఆ జిల్లాకి కలెక్టర్ గా వచ్చిన శరణ్య( ప్రగ్యా జైస్వాల్) మురళీకృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.
కానీ.., నల్లమల అడవుల్లో ప్రభుత్వానికి సైతం తెలియకుండా మైనింగ్ చేస్తున్న వరదరాజులపై( శ్రీకాంత్) ఆ జిల్లా కలెక్టర్ గా శరణ్య ఫోకస్ చేస్తుంది.
ఇంతలో వరదరాజులు చేస్తున్న యురేనియం తవ్వకాలతో చిన్నారుల ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది. దీంతో..మురళీకృష్ణ అత్యంత క్రూరుడైన వరదరాజులను ఢీ కొంటాడు.
ఈ క్రమంలోనే మురళీకృష్ణ కుటుంబం ప్రాణం మీదకి వస్తుంది. ఇలాంటి క్లిష్ట స్థితిలో శివుడు అలియాస్ అఖండ ఎంట్రీ ఇస్తాడు.
మరి.. కారణ జన్ముడైన అఖండ ఆ కార్యాన్ని ఎలా పూర్తి చేశాడు? మురళీకృష్ణ కుటుంబాన్ని ఎలా రక్షించాడు అన్నదే మిగిలిన కథ.
నటనలో నందమూరి బాలకృష్ణ ఓ విస్ఫోటనం. ఆయనకి సరైన కథ పడితే ఫలితం ఎలా ఉంటుందో గతంలో చాలాసార్లు చూశాము. అఖండ మూవీ కూడా ఇదే కోవలోకి వస్తుంది.
బోయపాటి శ్రీను కేవలం బాలకృష్ణని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ కథని సిద్ధం చేసుకున్నారని అర్ధం అవుతుంది.
సినిమా మొదట్లోనే బోయపాటి కథలోని కాంఫ్లిక్ట్ ని పరిచయం చేశాడు. అక్కడ నుండి బాలయ్య పవర్ ఫుల్ ఎంట్రీ, మాస్ డైలాగ్స్, పవర్ ఫుల్ ఫైట్స్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అందించాయి.
తరువాత వచ్చే లవ్ ట్రాక్ కాసేపు ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. కానీ.., కథలోకి దిగాక సినిమా పరుగులు తీసింది.
అఖండగా బాలయ్య ఎంట్రీ ఇచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఫ్యాన్స్ కి పూనకాలే. ఇంటర్వెల్ సీన్ కి థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం.
ఇక ఇక్కడ నుండి సినిమా అంతా అఖండ క్యారెక్టర్ మీదే రన్ అయ్యింది. నిజానికి ఇదే సినిమాకి ప్లస్ అయ్యింది.
మొత్తం యాక్షన్ సీక్వెన్స్ లతో నిండిపోయిన సెకండ్ ఆఫ్ కి బాలయ్య వన్ మ్యాన్ షో ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు.
నటీనటుల నటన : అఖండలో అఘోరాగా బాలకృష్ణ లుక్, యాక్టింగ్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అఖండ పాత్రలో బాలయ్య చెప్పిన ప్రతి డైలాగ్ అదిరిపోయింది.
సరైన క్యారెక్టర్ పడితే తన నట విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ మూవీతో బాలకృష్ణ మరోసారి నిరూపించారు. ఈ మాస్ జాతరకి ఎమోషన్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ కావడంతో అఖండ స్థాయి మరింత పెరిగిపోయింది.
బాలయ్య తరువాత ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ గురించి. వరదరాజుల పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించాడు.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చాలా రోజుల తరువాత నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. ఇక మిగిలిన నటీనటులు కూడా పాత్ర పరిధి మేర ఆకట్టుకున్నారు.
టెక్నీషియన్స్ పని తీరు: అఖండకి సినిమాలో స్క్రీన్ పై కనిపించే హీరో బాలకృష్ణ అయితే.., తెర వెనుక హీరో మాత్రం ఎస్.ఎస్. థమన్. పాటలకి అంతగా స్కోప్ లేని ఈ సినిమా కోసం థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
అఖండ ఎలివేషన్స్, ఎమోషన్స్ ఇంతగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి అంటే.. అది కేవలం థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లే.
ఇక సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎమ్.రత్నం మాటలు, రామ్, లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సీక్వెన్స్ లు బాగా కుదిరాయి.
నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దర్శకుడు బోయపాటి శ్రీను.
బోయపాటి మాస్ పల్స్ కి హేట్సాఫ్ చెప్పాల్సిందే. బాలయ్యలోని ఫుల్ ఎనర్జీని ఎలా వాడుకోవాలో తనకి మాత్రమే తెలుసుని..బోయపాటి అఖండతో మరోసారి నిరూపించారు.
ప్లస్ పాయింట్స్ : అఖండ పాత్రలో బాలకృష్ణ నటనయాక్షన్ ఎపిసోడ్స్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సెకండ్ ఆఫ్
మైనస్ పాయింట్స్ : ఫస్ట్ ఆఫ్ లోని లవ్ ట్రాక్ యాక్షన్ సీక్వెన్స్ లెంత్ ఎక్కువగా ఉండటం
చివరి మాట: అఖండ.. సినిమా కాదిది. మాస్ జాతర! బాలయ్య నట విశ్వరూపం.