కేవలం టాలెంట్‌ను నమ్ముకుని పైకి ఎదిగిన హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటారు ఐశ్వర్య రాజేష్. క్యాచీగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు.
పదహారణాల తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. ఆమెకు టాలీవుడ్ లో రెడ్ కార్పెట్ వేయలేదు.
నటుడు రాజేశ్ తనయ (కమెడియన్ శ్రీ లక్ష్మి మేన కోడలు కూడా) అయిన ఐశ్వర్య..తమిళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టింది.
మలయాళ, హిందీ పరిశ్రమల్లోకి అడుగుపెట్టాక తెలుగులో సినిమాలు చేసింది. రావడంతోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైంది.
కౌశ్యల కృష్ణమూర్తి సినిమాలో మంచి ఫెర్మామెన్స్‌ను కనబర్చింది.
వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాల్లో నటించింది. మొన్నీ మధ్య డ్రైవర్ జమున, ద గ్రేట్ ఇండియన్ కిచెన్‌తో మెప్పించింది.
ఇటీవల ఫర్హాన, సొప్పన సుందరి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్.
ఐతే ఫర్హానా మూవీ ప్రమోషన్స్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమె.. తెలుగు సినిమాలు చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
‘తెలుగు బిడ్డనైనా నేను, పెద్ద పెద్ద ఆఫర్లు, పెద్ద స్టార్ల పక్కన అవకాశాలు తక్కువగానే వచ్చాయి. నా బలం తమిళ సినిమా’నే అని చెప్పుకొచ్చింది.
అయితే ఆ మాటలు వక్రీకరించిన కొందరు.. శ్రీవల్లి పాత్రని రష్మిక కన్నా తానే బాగా చేసేదాన్ని అని కామెంట్స్ చేసినట్లు వైరల్ చేశారు.
అయితే రష్మిక ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మా హీరోయిన్‌నే అంత మాట అంటావా అంటూ ఐశ్వర్య రాజేష్ ని టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యడం మొదలుపెట్టారు.
అయితే ఈ విషయం ఐశ్వర్య రాజేష్ దృష్టిలో పడింది. ‘నేను రష్మికని అనలేదు, తన పట్ల చేసిన వ్యాఖ్యలను వక్రీకకరించారు’అని వివరణనిచ్చింది.
ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి పాత్రల్లో కనిపించాలని అడిగిన ప్రశ్నకు.. తనకు తెలుగులో సినిమాలు చేయాలనుకుంటున్నానని, శ్రీవల్లిలో పుష్ప క్యారెక్టర్ చేయాలనుకుంటున్నానని చెప్పానన్నారు
అంతే కానీ రష్మికను ఏమీ అనలేదు.నాకు తనపట్ల తన వర్క్ పట్ల రెస్పెక్ట్ ఉంది’అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.
లెటర్ హెడ్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని చెప్పిన ఐశ్వర్య రాజేష్, రష్మిక ఇష్యూని త్వరగానే సెటిల్ చేసే ప్రయత్నం చేసింది. ఇకనైనా అభిమానులు ఊరుకుంటారేమో చూడాలి.