సమ్మర్ హాలీ డేస్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సెలవులు వచ్చాయంటే చాలు.. ఎంజాయ్ చేయడానికి ప్లాన్స్ వేస్తుంటారు.

వేసవిలో కుటంబంతో కలసి కొందరు విహార యాత్రలు లేదా తీర్థ యాత్రలకు ప్లాన్ చేస్తారు. 

అయితే సమ్మర్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది స్విమ్మింగ్. కొత్తగా ఈత నేర్చుకునేవారు సమీపంలోని బావులు, చెరువులకు వెళ్లి స్విమ్మింగ్ చేస్తారు. 

పట్టణాలు, నగరాల్లో ఉండేవారు ఈత నేర్చుకునేందుకు స్విమ్మింగ్ పూల్స్​కు వెళ్తుంటారు.

వేడి వాతావరణంలో ఈత కొట్టడం మంచి అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. అయితే స్విమ్మింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బెటర్.

స్విమ్మింగ్ పూల్ నీటిలో క్లోరిన్ కలుపుతుంటారు. నీళ్లలో దీని శాతం అధికంగా ఉన్నప్పుడు ఈతకొడితే చర్మ సమస్యలు తలెత్తుతాయి. 

కాబట్టి స్విమ్మింగ్ పూల్​కు వెళ్లేముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. తద్వారా చర్మం మీద దద్దుర్లు రావు.  

స్విమ్మింగ్ చేసేముందు డైమెథికాన్, గ్లిజరిన్, నూనెలు, పెట్రోలేటమ్ ఉన్న మాయిశ్చరైజర్స్ వాడటం మంచి ఫలితాన్ని ఇస్తుందని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తున్నారు. 

చర్మంపై మాయిశ్చరైజర్ రాయడంతో పాటు పూల్​కు వెళ్లే 15 నిమిషాల ముందు వాటర్ ప్రూఫ్ సన్​స్క్రీన్​ను వినియోగించాలని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. 

స్విమ్మింగ్ గ్లాసెస్, క్యాప్ వాడటం వల్ల పూల్​లో ఉండే క్లోరిన్ కారణంగా కళ్లకు, జుట్టుకు ఇబ్బంది కలుగదు. 

స్విమ్మింగ్ చేసిన తర్వాత పూల్​లోని క్లోరిన్ మన శరీరంపై పేరుకుపోతుంది. కాబట్టి ఈత అనంతరం ఎప్పుడూ స్నానం చేయాలి. 

స్నానం చేసిన తర్వాత కూడా శరీరంపై మరోమారు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. 

ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఈతకు దూరంగా ఉండటం మంచిది. ఈ టైమ్​లో వేడి ఎక్కువగా ఉండటం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.