మీరు ప్రభాస్ అభిమానులా? 'ఆదిపురుష్' కోసం వెయిట్ చేస్తున్నారా? మీకోసమే ఓ బ్యాడ్ న్యూస్.

ఇది విని మీరు కాస్త డిసప్పాయింట్ కావొచ్చు. బట్ అంత పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు.

'బాహుబలి' ముందు వరకు ప్రభాస్ పేరు టాలీవుడ్ వరకు మాత్రమే తెలుసు. కానీ ఈ మూవీ పాన్ ఇండియా క్రేజ్ ని తెచ్చింది.

దీని తర్వాత ప్రభాస్.. 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు చేశాడు. కానీ అవి అనుకున్నంతగా హిట్ కాలేదు.

రాబోయే కొన్ని నెలల్లో మాత్రం వరసగా మూడు సినిమాలు.. థియేటర్లలో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రాబోతున్నాయి.

వీటిలో ఫస్ట్ రిలీజయ్యేది 'ఆదిపురుష్'. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమాని తొలుత ఈ ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు.

గతేడాది సెప్టెంబరులో 'ఆదిపురుష్' టీజర్ రిలీజ్ అవగానే విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. గ్రాఫిక్స్ ని ఏకిపారేశారు.

దీంతో మూవీ టీమ్.. రిలీజ్ తేదీని జూన్ కి వాయిదా వేసింది. అంతలో గ్రాఫిక్స్ లో మార్పులు చేసింది.

కొన్నిరోజుల ముందు విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ హమ్మయ్యా అనుకున్నారు. అంచనాలు పెంచేసుకున్నారు.

మరోవైపు 'ఆదిపురుష్'ని జూన్ లో జరగబోయే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తామని ప్రకటించారు.

జూన్ 13న ప్రీమియర్ షోలు పడతాయని తొలుత చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ షోలు కాస్త రద్దు చేసినట్లు తెలుస్తోంది.

జూన్ 13కి బదులు జూన్ 15న సాయంత్రం, జూన్ 17 మధ్యాహ్నం ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడీ విషయం కాస్త ఫ్యాన్స్ కి ఎక్కడలేని డౌట్స్ క్రియేట్ చేస్తోంది. మూవీ టీమ్ ప్రీమియర్స్ విషయంలో భయపడుతుందా అనిపిస్తోంది.

ఒకవేళ జూన్ 13న ప్రీమియర్స్ పడితే రివ్యూస్ బయటకొచ్చేస్తాయి. సినిమా బాగుంటే పర్లేదు. అదే తేడా కొడితే మాత్రం ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్సుంది.

దీనికి భయపడే 'ఆదిపురుష్' టీమ్ ప్రీమియర్స్ ని రద్దు చేసుకుందా? లేదా వేరే కారణం ఏమైనా ఉందా అనే డౌట్స్ ఫ్యాన్స్ కి వస్తున్నాయి.

మరి ఈ విషయంలో మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.