డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేసిన పాన్ ఇండియా 'ఆదిపురుష్'. వచ్చే నెల 16న థియేటర్లలోకి రానుంది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

సరిగా ఇలాంటి టైంలో 'ఆదిపురుష్' మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్.

అయితే 'ఆదిపురుష్'కి వివాదాలు కొత్తేం కాదు. ప్రభాస్ రాముడి గెటప్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే ట్రోల్స్ వచ్చాయి.

రాముడికి మీసాలు ఉండటం ఏంటని అన్నారు. రావణుడి గెటప్, వాహనంపై అయితే లెక్కలేనన్ని ట్రోల్స్ వచ్చాయి.

ఏడు నెలల క్రితం టీజర్ రిలీజ్ చేసినప్పుడు సినిమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు.

వాటన్నింటికీ చెక్ పెడుతూ ట్రైలర్ ని కట్ చేశారు. పెద్దగా గ్రాఫిక్స్ షాట్స్ లేకుండా జాగ్రత్తపడ్డారు.

ఓవైపు ట్రైలర్ బాగుందని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు కానీ నార్మల్ ఆడియెన్స్ మాత్రం ఎందుకో డౌట్ పడుతున్నారు.

ఒకవేళ 'ఆదిపురుష్' మూవీ టీమ్ సేఫ్ గేమ్ ఏమైనా ఆడుతుందా అనే సందేహపడుతున్నారు. కానీ బయటకు చెప్పలేదు.

సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తివారీ మాత్రం సెన్సార్ బోర్డులో ఈ మూవీపై కంప్లైంట్ చేశారు.

థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందు.. స్పెషల్ గా ఆదిపురుష్ స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

'ఆదిపురుష్' టీమ్ గతంలో పోస్టర్, టీజర్ విషయంలో చాలా తప్పులు చేశారని చెప్పిన ఆయన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఒకవేళ సినిమాలనూ తప్పులుంటే తమ మనోభావాలు దెబ్బతింటాయని సనాతన్ ధర్మ ప్రచారకర్త చెప్పారు.

మరి 'ఆదిపురుష్' మూవీ ఎప్పటికప్పుడూ కాంట్రవర్సీల్లో చిక్కుకోవడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.