సిమ్రన్ కొడుకుని చూశారా? హీరోలకు పోటీ ఇచ్చేలా ఉన్నాడు!

తెలుగు హీరోయిన్స్ ప్రస్తావన వస్తే సిమ్రన్ పేరు అందులో కచ్చితంగా ఉంటుంది.

తన డ్యాన్స్, గ్లామర్ తో కొన్నేళ్లపాటు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిందనే చెప్పాలి.

దాదాపు 11 ఏళ్ల కెరీర్ లో హిట్, బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా చేసి అదరగొట్టేసింది.

1997లో 'అబ్బాయిగారి పెళ్లి' మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంటరైంది.

అనంతరం టాప్-4 హీరోలైన చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ తో నటించి హిట్స్ కొట్టింది.

వీళ్లు మాత్రమే కాదు మిగతా హీరోలతోనూ సినిమాలు చేసిన సిమ్రన్ చాలా క్రేజ్ సంపాదించింది.

2008లో 'జాన్ అప్పారావ్ 40 ప్లస్' అనే తెలుగు సినిమాలో చివరగా సిమ్రన్ నటించింది.

ఓవైపు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్నప్పటికీ.. తన చిన్నప్పటి ఫ్రెండ్ దీపక్ ని 2003లో పెళ్లి చేసుకుంది.

2009 వరకు వరస మూవీస్ చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత ఓ ఐదేళ్ల పాటు బ్రేక్ తీసుకుని, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసింది.

మళ్లీ 2014లో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కేవలం తమిళ సినిమాలు మాత్రమే నటిస్తూ వస్తోంది.

ప్రస్తుతం తమిళంలో తన 50వ సినిమా చేస్తున్న సిమ్రాన్.. డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు ఇదంతా పక్కనబెడితే సిమ్రాన్ కొడుకు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు

బిహైండ్ వుడ్స్.. తన ట్విట్టర్ ఖాతాలో సిమ్రన్ కొడుకు అదీప్ ఫొటోల్ని షేర్ చేసింది.

యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా ఉన్న అదీప్ ఫొటోలపై సిమ్రన్ కామెంట్ చేసింది. బిహైండ్ వుడ్స్ కు థ్యాంక్స్ చెప్పింది.

సిమ్రన్ కు అదీప్ తోపాటు అదిత్ అని మరో కొడుకు కూడా ఉన్నాడు. సో అదన్నమాట విషయం.

మరి సిమ్రన్ కొడుకు.. తల్లిలా యాక్టర్ అవుతాడా? లేదా ఇంకేదైనా ఫీల్డ్ లోకి వెళ్తాడా అనేది చూడాలి?