హీరో లేదా హీరోయిన్లు.. తనతో పాటు యాక్ట్ చేసిన కో యాక్టర్స్ ని పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు.

సినిమా లేదా సీరియల్ అనేది సంబంధం లేదు. ఇలా చాలామంది భామలు పెళ్లి చేసుకున్నారు.

తెలుగులోనూ ఈ లిస్ట్ తీస్తే చాలా పెద్దగానే ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడివి బ్రేక్ అవుతున్నాయి.

చెప్పాలంటే నటీనటులు.. కొన్నాళ్లు రిలేషన్ షిప్ లో ఉండి, ఫ్రెండ్స్-ఫ్యామిలీ సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు.

సెలబ్రిటీలు కాబట్టి చాలా అంటే చాలా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ తరహా పెళ్లి చేసుకుంటున్నారు.

కానీ కొన్నాళ్లకు కావొచ్చు, కొన్నేళ్లకు కావొచ్చు.. వైవాహిక జీవితంలో మనస్పర్థలు వస్తున్నాయి.

దీంతో వీలైనంతగా సర్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా కుదరని పక్షంలో విడాకులు తీసేసుకుంటున్నారు.

ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు.. మహా అయితే పెళ్లి తర్వాత కొన్నేళ్లకు డివోర్స్ ఇచ్చేవారు.

ఇప్పుడు చెప్పబోయే ఓ బ్యూటీ మాత్రం.. పెళ్లి జరిగిన తర్వాత కేవలం 2 నెలల్లోనే భర్త నుంచి విడిపోయింది.

అసలు విషయానికొస్తే.. తమిళ సీరియల్ 'సిప్పినీల్ ముత్తు'లో లీడ్ రోల్స్ గా సంయుత, విష్ణుకాంత్ చేస్తున్నారు.

గత కొన్నేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న ఈ జంట.. మార్చి 3న గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. అందరూ విషెస్ కూడా చెప్పారు.

సరిగా రెండు నెలలు అయిందో లేదు.. ఇద్దరూ కూడా తమ ఇన్ స్టాలో పెళ్లి ఫొటోస్ ని డిలీట్ చేసి పడేశారు.

అలానే విడాకులు తీసుకున్నట్లు డైరెక్ట్ గా చెప్పకపోయినా.. ఇన్ డైరెక్ట్ గా కాస్త విషయాన్ని ఇన్ స్టా స్టోరీల్లో పెట్టుకొచ్చారు.

దీంతో నెటిజన్స్ ఈ జంటపై విమర్శలు చేస్తున్నారు. పెళ్లిని మరీ సిల్లీ చేసేస్తున్నారని తిడుతున్నారు.

మరీ రెండు నెలల్లోనే సీరియల్ హీరోయిన్ సంయుత విడాకులు తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.