'సార్' హీరోయిన్ ఎవరో తెలుసా? అంటే అందరూ ఓ యస్ అని తల ఊపి మరీ చెబుతారు.

మలయాళంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన సంయుక్త మేనన్ తెలుగులో చాలా క్రేజ్ తెచ్చుకుంది.

2021లో వచ్చిన 'భీమ్లా నాయక్'తో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రానా వైఫ్ గా యాక్ట్ చేసింది.

సినిమాలో ఈమెది చిన్న పాత్రే, అలానే పద్ధతిగా కనిపించింది కానీ ప్రేక్షకుల్ని మాత్రం ఎట్రాక్ట్ చేసింది.

ఇక ఆ తర్వాత కల్యాణ్ 'బింబిసార'లో పోలీస్ గా నటించి ఆకట్టుకుంది. అద్భుతమైన హిట్ కొట్టేసింది.

'సార్' మూవీలో టీచర్ గా నటించిన సంయుక్త.. మాస్టారూ మాస్టారూ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

ఇలా వరసగా చేసిన మూడు తెలుగు సినిమాలతోనూ సక్సెస్ అందుకుని టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అయిపోయింది.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఫాంటసీ మూవీ 'విరూపాక్ష'లో సంయుక్తనే హీరోయిన్ గా చేస్తోంది.

అయితే ఈ సినిమాలో ఈమె పాత్ర ఏంటి? ఎలా ఉండబోతుంది? అని ఒక్క అప్డేట్ కూడా ఏం బయటకు రాలేదు.

తాజాగా ఉగాది సందర్భంగానూ సాయిధరమ్ తేజ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సంయుక్త సీరియస్ అయింది.

తనకు మాటిచ్చి తప్పారని.. తన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

'నేను చాలా అసంతృప్తికి గురయ్యాను. దీనికంటే ముందు ఓ విషయం చెప్పాలి. 'విరూపాక్ష'లో మంచి టీమ్ తో కలిసి పనిచేశాను'

'ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ దీన్ని గుర్తుపెట్టుకుంటాను కూడా'

'మరి svcc ఎందుకు ఇంతలా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారు. నా పోస్టర్ ఉగాదికి విడుదల చేస్తామని మాట తప్పారు' అని సంయుక్త ట్వీట్ చేసింది.

అయితే సంయుక్త ట్వీట్ పై స్పందించిన సదరు నిర్మాణ సంస్థ.. సారీ చెబుతూనే పోస్టర్ రిలీజ్ కు టైం కావాలని రిప్లై ఇచ్చింది.

ఇదంతా చూసిన నెటిజన్స్.. ఫస్ట్ అవాక్కయ్యారు. ఆ తర్వాత.. 'ఇదేం ప్రమోషనల్ స్టంట్ కాదు కదా' అని మాట్లాడుకుంటున్నారు.

మరి సార్ హీరోయిన్ సీరియస్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.