తెలుగులో పదుల సంఖ్యలో హీరోయిన్లు ఉన్నారు. అందులో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేసేవాళ్లు తక్కువే.

'జయం' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సదా.. ఇప్పటికే అదే లుక్ మెంటైన్ చేస్తూ వస్తోంది.

ఫస్ట్ మూవీ తర్వాత ఎన్టీఆర్, బాలకృష్ణ, విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.

సినిమాలు అయితే చేస్తూ వచ్చింది గానీ హిట్ కొట్టలేక చాలా వెనకబడిపోయింది. స్మాల్ స్క్రీన్ వైపు వచ్చేసింది.

ఢీ డ్యాన్స్ షోకి జడ్జిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న సదా.. గత సీజన్ లో బిగ్ బాస్ సూపర్ జోడీకి జడ్జిగా చేసింది.

ప్రస్తుతం డ్యాన్స్ షోలు లేకపోవడంతో ఖాళీగానే ఉంది. అలాంటి ఆమె సడన్ గా ఏడుస్తూ కనిపించింది.

దీంతో నెటిజన్స్ చాలామంది షాకయ్యారు. అసలేం జరిగింది? ఎందుకు ఏడుస్తుందా అని ఆరా తీశారు.

హీరోయిన్ గా టాలీవుడ్ లో బాగానే ఫేమ్ తెచ్చుకున్న సదా.. రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంటరైంది.

తాజాగా వీడియోలో అదే విషయాన్ని చెబుతూ, కెఫె పెట్టడానికి ఎంత కష్టపడ్డామో కూడా వివరించింది.

'2019 ఏప్రిల్ లో ఎర్త్ లింగ్స్ కెఫె మొదలుపెట్టాను. ఇది నా తొలి వ్యాపారం. కన్నబిడ్డలా దీన్ని చూసుకున్నాను'

'కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే కెఫె ఓనర్ ఫోన్ చేసి, నెలలో ఖాళీ చేయమని చెప్పారు'

'ఇది విన్న నాకు పెద్ద షాక్ తగిలినట్లు అనిపించింది. మూడు వారాల్లోనే ఖాళీ చేయాలి. నాకైతే ఏడుపొచ్చేస్తోంది.'

'కెఫె కట్టడానికి ముందు ఈ ప్లేస్ చాలా దారుణంగా ఉండేది. కొవిడ్ టైంలో ఇక్కడే రోజూ 12 గంటలు పనిచేశాం.'

'ఆ టైంలో ఇదే ప్రపంచంగా బతికాను. లాక్ డౌన్ లో వ్యాపారం సరిగా లేకపోయినా టైమ్ కి అద్దె చెల్లించాను'

'అలాంటిది దీన్ని ఇప్పుడు వదిలి వెళ్లాలంటే మనసు రావడం లేదు. ఏదో కోల్పోతున్నట్లు ఉంది. తట్టుకోలేకపోతున్నాను'

ఇలా సదా.. తన కెఫె గురించి ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఓ వీడియోని పోస్ట్ చేసింది.