ప్రియాంక నల్కారి.. బాల నటిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
2010లో విడుదలైన ‘అందరి బంధువయా’ మూవీలో నటిగా పరిచయమైంది.
ఆ తర్వాత పలు సీరియల్స్, టీవీ షోలు చేసింది ప్రియాంక.
తర్వాత ఈటీవీ ప్లస్‌లో వచ్చిన సినిమా చూపిస్తా మావ షోలో గెటప్ శ్రీనుతో కలిసి పని చేసింది.
కానీ ఇవేవి ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదు. దాంతో తమిళ్ ఇండస్ట్రీ బాట పట్టింది.
ప్రస్తుతం ఈమె తమిళ్‌లో నటిస్తోన్న రోజా సీరియల్.. ప్రియాంకకు మంచి గుర్తింపు ఇచ్చింది.
ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. తాజాగా విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకుని.. అందరికి షాక్ ఇచ్చింది ప్రియాంక.
మలేషియాలో, మురగన్ ఆలయంలో.. సీక్రెట్‌గా.. ఎలాంటి ఆడంబరాలు లేకుండా వివాహం చేసుకుంది.
పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె తప్ప.. ఇంక వేరే ఎవరూ ఈ వివాహానికి హాజరైనట్లు లేదు.
ఇక ప్రియాంక వివాహం చేసుకున్న వ్యక్తి నటుడు మాత్రమే కాక.. బిజినెస్ మ్యాన్ కూడా.
అతడి పేరు రాహుల్ వర్మ. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడింది.
అది కాస్త ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
2018లోనే ప్రియాంక-రాహుల్ వర్మలకు నిశ్చితార్థం జరిగింది. కానీ సీరియల్స్‌లో బిజీగా ఉండటంతో.. వివాహం వాయిదా వేస్తూ వచ్చింది.
దాంతో రాహుల్ వర్మ.. కొన్నాళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుని మలేషియా వెళ్లాడు.
దాంతో ప్రియాంక తాజాగా మలేషియా వెళ్లింది. అక్కడ మురగన్ ఆలయంలో వీరు వివాహం చేసుకున్నారు.
పెళ్లి ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. వివాహం అయినట్లు ప్రకటించింది.
ఈ ఫొటోలు చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత సీక్రెట్‌గా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా.. వివాహం సందర్భంగా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం ‘సన్ టీవీ’లో ప్రసారమయ్యే ‘రోజా’ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
అలాగే జీ-తమిళ్‌లో ప్రసారమయ్యే ‘సీతారామన్’ సీరియల్‌లో కూడా నటిస్తోంది ప్రియాంక.
తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లో నటించింది ప్రియాంక.