నటి పూర్ణ..తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేని హీరోయిన్

ఆమె అసలు పేరు షామ్మా కాసీం.మోడల్, క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాక పూర్ణ అని పేరు మార్చుకున్నారు.

తొలుత మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పూర్ణకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. 

దీంతో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చారు. శ్రీహరి హీరోగా నటించిన శ్రీ మహాలక్ష్మి ద్వారా ఈ తెరకు పరిచయమైంది

ఆ తర్వాత నరేష్ సరసన సీమ టపాకాయ్‌లో నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.  

అయితే ఆమెకు పేరు తెచ్చింది మాత్రం దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన హారర్ మూవీస్ అవును, అవును 2తోనే. 

రాజు గారి గది, సిల్లీ ఫెలోస్, జయమ్ము నిశ్చయమ్మురా, రాక్షసి వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత విలనీ పాత్రలో కూడా మెప్పించింది.

ప్రముఖ చానల్‌లో ప్రసారమౌతున్న ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా కూడా వ్యవహరించింది పూర్ణ.

 గత ఏడాది దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించి షాక్ నిచ్చింది. 

దీనిపై ప్రశ్నలు తలెత్తుతుండటంతో తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వివరణనిచ్చింది. 

ఈ మధ్యే నటి పూర్ణకు  సీమంతం ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా కొన్ని ఫోటో షూట్లకు సంబంధించిన  ఫోటోలను కూడా ఆమె నెట్టింట్లో షేర్ చేసింది. 

నటి పూర్ణ మంగళవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు బాబు పుట్టాడు. 

దుబాయ్‌లోని ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబును ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బందితో నటి పూర్ణ ఓ ఫోటోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. 

భర్త, బిడ్డతో ఉన్న ఫోటోలను  కూడా ఆమె అభిమానులతో పంచుకుంది. 

దీంతో ఈ దంపతులకు సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

తాజాగా నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ మార్చి 30 న రిలీజ్ అయ్యింది.. ఇందులో విలన్ భార్యగా పూర్ణ ముఖ్యపాత్రలో నటించింది.