ప్రముఖ బాలీవుడ్‌ నటి భూమీ పడ్నేకర్‌ తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు.

కొద్దిరోజుల క్రితం ఆమె పెళ్లి విషయం సోషల్‌ మీడియాలో రచ్చకు దారి తీసింది.

ఆమె వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటాన్ని కొందరు నెటిజన్లు తప్పుబట్టారు.

ఇప్పుడు మరోసారి భూమీ పడ్నేకర్‌ వివాదంలో చిక్కుకున్నారు.

ఆమె తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమెను జ్యోతి ప్రజ్వలన చేయడానికి రమ్మన్నారు.

అప్పుడే ఆమె కాళ్లకు చెప్పులు ఉన్నాయి. వాటిని తీయటానికి ప్రయత్నించారు.

అయితే, ఆ చెప్పులు తీయటం ఆమె వల్ల కాలేదు.

దీంతో అక్కడే ఉ‍న్న తన అసిస్టెంట్‌ సహాయం చేసుకున్నారు. అతడు ఆమె చెప్పులు తీశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.