సినీ నటీనటులు కమర్షియల్ యాడ్స్ లో నటించడం మనం చూస్తూనే వస్తున్నాం.పలు కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ వాల్యూని పెంచుకోవడం కోసం సినిమా వాళ్ళను ఆశ్రయిస్తూ ఉంటారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు కూడా గతంలో యాడ్స్ లో నటించిన సందర్భాలు ఉన్నాయి.అయితే ఎంత డబ్బు ఇస్తామని పలు కార్పోరేట్ కంపెనీలు ఆఫర్ చేసినా కొంతమంది నటీనటులు మాత్రం కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి అంగీకరించలేదు. వాళ్ళు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి :
బాలయ్యతో పలు కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలని సంప్రదించాయి. కానీ బాలయ్య అందుకు ఓకే చెప్పలేదు.ఏదైనా మంచి విషయాన్ని సమాజానికి చేరువయ్యేలా చెప్పే యాడ్ లో ఫ్రీగా నటిస్తాను తప్ప.. వాణిజ్య పరమైన వాటిలో నటించడం ఇష్టం లేదని గతంలో బాలయ్య స్పష్టంచేశారు.
గతంలో మోహన్ బాబుని పలు సంస్థలు సంప్రదించాయి. కానీ అందుకు ఈయన ఒప్పుకోలేదు. దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా బయటకు రాలేదు.
తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన గౌతమికి కూడా గతంలో పలు యాడ్స్ లో నటించే అవకాశం లభించింది. భారీగా పారితోషికం కూడా ఆఫర్ చేశారు. కానీ అందుకు ఈమె ఒప్పుకోలేదు.
ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ లో ఈమెను నటింపజేయడానికి ఓ సంస్థ ప్రయత్నించింది. కానీ అందుకు ఈమె ఒప్పుకోలేదు.
మెగా మేనల్లుడు సాయి తేజ్ కు కూడా అతని కెరీర్ ప్రారంభంలో.. పలు యాడ్స్ లో నటించే అవకాశం వచ్చింది. కానీ అప్పుడే కమర్షియల్ యాడ్స్ లో నటించడం ఇష్టం లేదని అతను స్పష్టం చేసాడట.