టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సహాయం కోసం వచ్చిన వారందరికీ లేదనుకుండా సాయం చేస్తూ ఉంటారు.
సినిమా పరిశ్రమలో కూడా చిరంజీవి నుంచి సాయం పొందిన వాళ్లు ఉన్నారు.
అలా చిరంజీవితో సాయం పొందిన వారిలో తమిళ నటుడు పొన్నంబలం ఒకరు.
పొన్నంబలం కిడ్నీ చికిత్స కోసం చిరంజీవి 40 లక్షల సాయం చేశారు.
ఈ సాయం గురించి తాజాగా, పొన్నంబలం మీడియాతో మాట్లాడుతూ..
నేను కిడ్నీ అనారోగ్యంతో ఉన్నపుడు తమిళ నటులు డయాలసీస్‌కు సాయం చేసేవారు.
డబ్బులు చాలక చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఓ రోజు నా అల్లుడు నన్ను ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్లాడు.
అక్కడ పూజ తర్వాత పూజారి చిరంజీవ, చిరంజీవ అన్నారు.
నాకు చిరంజీవి గారి గురించి ఆలోచన వచ్చింది.
నా ఫ్రెండ్ ద్వారా చిరంజీవి గారి ఫోన్ నెంబర్ తీసుకున్నాను.
తర్వాత ఆయనకు ఫోన్ చేశాను. ఆయన 2 లక్షలు ఇస్తాను అనుకున్నారు.
కానీ, చిరంజీవి గారు ఏకంగా 40 లక్షల రూపాయలు సాయం చేశారు.