టాలీవుడ్‌లో నటీనటులకు కొదవ లేదు. నాటి తరం నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల నుండి నేటి తరం నటుల వరకు తమను తాము నిరూపించుకున్నవారే.
అయిన్నప్పటికీ ఇతర ఇండస్ట్రీ వాళ్లకు కూడా టాలీవుడ్ ఆఫర్లు ఇస్తుంటుంది. వారిని ప్రోత్సహిస్తుంది.
ఇతర పరిశ్రమల్లోని నటీమణులే కాకుండా కమెడియన్లు, విలన్లు.. ఈ పరిశ్రమలోకి వచ్చి పేరు తెచ్చుకున్న వారు అనేక మంది ఉన్నారు.
అలా శాండిల్ వుడ్ నుండి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు దేవరాజ్. ఇక్కడ విలన్ పాత్రలతో మెప్పించారు.
ఎర్రమందారంలో జగ్గన్నదొరగా, యజ్ఖంలో హీరోయిన్ తండ్రిగా మెప్పించిన నటుడే దేవ రాజ్.
కన్నడలో హీరోగా కూడా నిరూపించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ సీమల్లో సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించారు.
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఆయన..థియేటర్ ఆర్టిస్టు కూడా.
తొలుత కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి సినిమా విడుదల కాకపోయినా, రెండో సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డును కైవసం చేసుకున్నాడు.
తెలుగులో 1989లో వచ్చిన భారత నారి సినిమాతో విలన్‌గా పరిచయమయ్యారు.
20వ శతాబ్దం, ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ, అన్న, ఎస్.పి. పరుశురాం, సమరసింహా రెడ్డి, లక్ష్యం, భరత్ అనే నేను సినిమాలో నటించారు.
ఆయన నటి చంద్రలేఖను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సినిమాల్లో రాణిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోను సుమన్ టీవీ పలకరించింది. ఆయనను పలకరిస్తూ.. హోం టూర్ చేసింది.
ఆయన ఇల్లు చూస్తే కోటను తలపిస్తుంటోంది. ఇంట్లోకి వెళ్లగానే.. అవార్డులు, పెయింటిగ్స్, ఫ్యామిలీ ఫోటోస్ కనిపిస్తున్నాయి.
ఆయనతో జరిగిన చిన్న చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తానెప్పుడూ సినిమా స్టార్ అవుతాడని అనుకోలేదని అన్నారు. తాను థియేటర్ ఆర్టిస్టునని, స్నేహితులు పిలిస్తే సినిమాల్లోకి వెళ్లినట్లు చెప్పారు.