కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ “ఆచార్య”. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఆచార్య ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ముందుగా కథ విషయానికి వస్తే.. ధర్మస్థలిలో ధర్మం దారి తప్పుతుంది. అక్కడ.. మున్సిపల్ ఛైర్మెన్ అయిన బసవ.. తన స్వార్ధంతో ధర్మస్థలిలో ధర్మం అనేది లేకుండా అక్రమాలకు పాల్పడుతుంటాడు.
పాదఘట్టం వారిని గుడికి దూరం చేయాలని చూస్తుంటాడు. ఇలాంటి సమయంలో ధర్మస్థలిలో ఆచార్య అడుగు పెడతాడు. ధర్మస్థలిలో దర్మం తప్పిన ప్రతి ఒక్కరికి తన స్టయిల్‌లో గుణపాఠాలు చెప్తూ.. పాదఘట్టం ప్రాంత ప్రజల్లో మళ్ళీ ధైర్యాన్ని నింపుతాడు.
ఆచార్య ఎవరు? ధర్మస్థలిని, పాదఘట్టాన్ని, సిద్దవనాన్ని కాపాడటమే అతని ధ్యేయం ఎలా అయ్యింది? ఈ మొత్తం కథలో సిద్ద ఎవరు? అన్నదే మిగతా కథ.
కథగా చెప్పుకోవడానికి ఆచార్య మూవీలో కొత్తదనం ఏమీ లేదు. కానీ.., ఆ కథ చుట్టూ ధర్మస్థలి, నక్సల్స్ నేపధ్యం అంటూ.. కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు రచయత, దర్శకుడు కొరటాల.
ఈ కథని చెప్పడానికి కొరటాల రాసుకున్న సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేకుండా పోయింది. అయితే.. అద్భుతమైన విజువల్స్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది.
ఎప్పుడైతే ఆచార్య రంగంలోకి దిగుతాడో అక్కడి నుండి ఇంటర్వెల్ బ్లాక్ వరకు మూవీ పరుగులు తీస్తుంది. ఇంటర్వెల్‌లో సిద్ద పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోతుంది.
సిద్ద పాత్రలో రామ్ చరణ్ ఎంట్రీతో ఆచార్య మూవీ వేగం అందుకుంటుంది. ఇక ఇక్కడి నుండి ఫ్యాన్స్‌కి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. కానీ.., సిద్ధ- పూజా హెగ్డేల లవ్ ట్రాక్ అంతగా వర్కౌట్ కాలేదు.
ఆచార్య లాంటి కథని బలంగా చెప్పడానికి మెగాస్టార్ తన మాస్ ఇమేజ్‌ని సైతం పక్కన పెట్టి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయడం విశేషం. ఇక 66 ఏళ్ళ వయసులో ఆ గ్రేస్‌తో చిరు వేసిన స్టెప్పులు థియేటర్స్ దద్దరిల్లిపోయేలా చేశాయి.
సిద్ద పాత్రలో రామ్ చరణ్ ఆచార్య మూవీకి ఒక పరిపూర్ణత తీసుకుని రావడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.
ఆచార్య చిత్రంలో టెక్నికల్ విభాగంలో ముందుగా అభినందించాల్సింది మాత్రం ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్‌న, కెమెరా మేన్ తిరుని. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మాత్రం విఫలం అయ్యాడు
ఆచార్య విషయంలో రచయతగా కొరటాల ఎంత దారుణంగా విఫలం అయ్యాడు. దర్శకుడిగా మాత్రం కొరటాల శివ పరవాలేదు అనిపించాడు.
చిరంజీవి, రామ్ చరణ్ నటన, డ్యాన్స్.. యాక్షన్ సీక్వెన్స్ లు, కెమెరా, ఆర్ట్ వర్క్ ఆచార్య మూవీలో ప్లస్ పాయింట్స్.