టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో జింబాబ్వే  సంచలనం నమోదు చేసింది.

టైటిల్‌ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉన్న పాకిస్థాన్‌ను  ఒక్క పరుగు తేడాతో ఓడించింది.

తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాక్‌..  జింబాబ్వేతో మ్యాచ్‌లో కూడా ఓడి.. సెమీస్‌  అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.

పాకిస్థాన్‌ సెమీస్‌ ఆశలపై దెబ్బకొట్టి..  సికందర్‌ రజా హీరో అయిపోయాడు.

3 వికెట్లు పడగొట్టడమే కాకుండా..  తన బౌలింగ్‌ వేరియేషన్స్‌తో పాక్ బ్యాటర్లను  ముప్పుతిప్పలు పెట్టాడు. 

ఆడుతూ.. పాడుతూ.. లక్ష్యాన్ని  ఛేదిస్తుందనుకున్న పాక్‌ను తన వినూత్న  బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. 

రజా బౌలింగ్ శైలి.. అచ్చం మిస్టరీ స్పిన్నర్  సునీల్ నరైన్‌ను పోలి ఉంది. 

నరైన్ బాల్ వెనుకవైపు దాచుకొని వచ్చి డిఫరెంట్  వేరియేషన్స్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు. 

రజా సైతం అచ్చం అలానే 6 బంతుల్లో  4 వేరియేషన్స్ చూపించి పాక్ బ్యాటర్ల  భరతం పట్టాడు. 

క్రాస్ సీం, బ్యాక్ అఫ్ హ్యాండ్, క్యారం బాల్,  ఆఫ్ స్పిన్.. ఇలా ఒక్కో బంతిని ఒక్కోలా వేశాడు.

వాస్తవానికి 3 బంతుల్లో మ్యాచ్ ముగుస్తుందనే  వరకు విజయం పాకిస్థాన్ వైపే ఉంది.

కానీ.. రజా సంచలన బౌలింగ్‌తో  జింబాబ్వే చరిత్ర సృష్టించింది. 

ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి..  పాక్‌ పరువు తీసింది. రజా ప్లేయర్‌  ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.