ఈ సరద కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోగా... మరికొందరు బయటపడుతుంటారు.
30 ఏళ్ల యువకుడు విషయంలోనూ అదే జరిగింది. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడ్డాడు.
బొలీవియాకు చెందిన జోనాటన్(30) అనే వ్యక్తి జనవరి 25న స్నేహితులతో కలిసి అమెజాన్ అడవుల్లో వేటకు వెళ్లాడు.
వేటకు వెళ్లిన సమయంలో బొలీవియర్స్ సమీపంలో పర్వత ప్రాంతంలో జోనాటన్ తప్పిపోయాడు.
అలా స్నేహితుల నుంచి తప్పిపోయి అమెజాన్ అడవుల్లో ఒక నెల పాటు చిక్కుకుపోయాడు.
అమెజాన్ అడవుల్లో నుంచి బయటపడే మార్గం దొరకక 31 రోజుల పాటు పిచ్చి వాడిలా తిరిగాడు.
ఈ నెల రోజుల పాటు సజీవంగా ఉండటానికి అతడు నేర్చుకున్న కొన్ని విద్యాలు ఉపయోగపడ్డాయి.
కీటకాలు, వానపాములను తింటూ, మూత్రం తాగుతూ బతకాల్సి వచ్చిందని అతడు తెలిపాడు.
అంతేకాక అడవిలో దొరికే పండ్లు తింటూ, వర్షం నీరు తాగే వాడినని తెలిపాడు.
31 రోజుల తరువాత రెస్క్యూ టీమ్ కంట్లో పడి ప్రాణాలతో బయటపడ్డాడు.
రెస్క్యూ టీమ్ అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అమెజాన్ అడవుల నుంచి బయటపడిన జోనాటన్ ఆరోగ్య బాగానే ఉందని వైద్యలు తెలిపారు.
తనకు పునర్జన్మను ప్రసాధించిన దేవుడికి జోనాటన్ కృతజ్ఞతలు తెలిపాడు
భవిష్యత్తులో ఎప్పుడు వేటకు వెళ్లనని, దేవుడి గీతాలు వింటూ కాలక్షేపం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు