నీరు గొబ్బి మొక్క గురించి ఈ జనరేషన్ కిడ్స్ కి తెలియదు. వర్షాకాలంలో నీటి గుంటల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్కలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.
సంస్కృతంలో ఈ మొక్కను కోకిలాక్ష అని పిలుస్తారు. ఇవి నలుపు, తెలుపు, ఊదా రంగు పూలు కలిగి ఉంటాయి. ఈ మొక్కకు ముళ్ళు కూడా ఉంటాయి.
వాతం, కఫం వంటి రోగాలను నయం చేయడంలో ఇది బాగా పని చేస్తుంది. నీరు గొబ్బి మొక్క గింజలను, దూలగొండి గింజలను సమపాళ్ళలో తీసుకుని ఆవు పాలలో పోసి మరిగించాలి.
పాలు పూర్తిగా ఆవిరై పోయేవరకూ మరిగించాలి. ఆ తర్వాత గింజలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని, పటిక బెల్లంతో కలిపి నిల్వ చేసుకుని..
రోజూ రెండు పూటలా ఒక టీ స్పూన్ గ్లాస్ పాలలో కలిపి సేవించాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మగవారు నీరు గొబ్బి గింజల పొడిని, దూలగొండి గింజల పొడిని సమానంగా టీ స్పూన్ మోతాదులో తీసుకుని.. అప్పుడే పితికిన తాజా ఆవు పాలతో కలిపి తాగాలి
ఇలా చేస్తే శీఘ్రస్కలన సమస్య తగ్గి.. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
నీరు గొబ్బి చెట్టు, పల్లేరు చెట్టు, ఆముదం చెట్ల వేర్లను తీసుకుని.. ఎండబెట్టి పొడి చేసుకోవాలి.
ఆ పొడిని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని.. అర కప్పు పాలలో కలిపి తాగాలి. ఇలా రోజుకి రెండు పూటలా చేస్తే.. మూత్రపిండాల్లో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.
గొబ్బి చెట్టు వేరుని నెత్తి మీద వస్త్రంతో కట్టుకుని పడుకుంటే.. నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
దీని వేరుని.. తిప్ప తీగ కాదలతో కలిపి.. కషాయం తయారు చేసుకుని 30 నుంచి 60 మి.లీ. తాగితే వాత రోగాలు ఉంటే పోతాయి.
నెలసరి సమయంలో స్త్రీలకు అధిక రక్తస్రావం అవుతుంది. నీరు గొబ్బి మొక్క గింజల పొడిని 2 గ్రాముల మోతాదులో తీసుకుని.
అరకప్పు కుండ నీటిలో కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా చేస్తే నెలసరి సమయంలో వచ్చే అధిక రక్తస్రావం తగ్గుతుంది.
నీరు గొబ్బి మొక్క వేరుని దంచి పొడిగా చేసి.. ఆ పొడిని అర కప్పు నీటిలో కలిపి సేవించడం వల్ల స్త్రీలలో వచ్చే తెల్ల బట్ట సమస్య తొలగిపోతుంది.
నీరు గొబ్బి మొక్కను వేర్లతో సహా బయటకు తీసి ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి.
ఆ బూడిదను అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని నీటిలో కలిపి తాగాలి. ఇలా చేస్తే.. శరీరంలో వాపులు ఏమైనా ఉంటే తగ్గుతాయి.
కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడే వారు నీరు గొబ్బి మొక్క ఆకుల రసాన్ని పరగడుపున రెండు టీ స్పూన్లు తాగితే.. మూత్రపిండాల పనితీరు బాగుంటుంది.
ఈ నీరు గొబ్బి మొక్కను దంచగా వచ్చిన రసాన్ని ఆముదం నూనెతో కలిపి మరిగించాలి.
కాసేపటి తర్వాత ఆ నూనెను చల్లార్చి.. శరీరంలో నొప్పులు ఉన్న చోట రాసుకుని మర్దనా చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
గొబ్బి మొక్క వేర్లతో కషాయం చేసుకుని రెండు పూటలా 50 మి.లీ. చొప్పున తాగితే కిడ్నీ సమస్యలు తొలగిపోతాయి.
నీరు గొబ్బి మొక్క, ఇతర ఔషధ మొక్కలతో చేసిన మదనకామేశ్వరి చూర్ణాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని.
టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆవు నెయ్యితో కలిపి రోజుకి రెండు పూటలా తాగితే లైంగిక వాంఛ పెరుగుతుంది. తద్వారా భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. .
గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలంలో సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.