ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి గూగుల్‌ మ్యాప్స్‌ ఓ నిత్యావసరంగా మారింది.

టెక్ టాపిక్

ముఖ్యంగా డెలివరీ బాయ్స్‌ అడ్రస్‌ను తెలుసుకోవటానికి గూగుల్‌ మ్యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

టెక్ టాపిక్

నిజం చెప్పాలంటే గూగుల్‌ మ్యాప్స్‌ లేకపోతే చాలా మందికి ఉపాది లేదు.

టెక్ టాపిక్

గూగుల్‌ మ్యాప్స్‌లోని ప్రత్యేకమైన ఫ్యీచర్స్‌ కారణంగా ఏ అడ్రస్‌నైనా ఇట్టే కనిపెట్టేయొచ్చు.

టెక్ టాపిక్

ముఖ్యంగా కొత్త కొత్త ఊర్లకు ప్రయాణించే వాళ్లకు గూగుల్‌ మ్యాప్స్‌ ఎంతో అవసరంగా ఉంటోంది.

టెక్ టాపిక్

వాహనం ఏదైనా కానీ, మొబైల్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ ఆన్‌ చేసుకుని పెట్టుకుంటే మనకు కావాల్సిన అడ్రస్‌కు మార్గాన్ని తెలుసుకుని వెళ్లొచ్చు.

టెక్ టాపిక్

ఇక, గూగుల్‌ మ్యాప్స్‌ కూడా యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఫీచర్స్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. తాజాగా, ‘‘టోల్‌’’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

టెక్ టాపిక్

ఈ ఫీచర్‌ హైవేపై ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

టెక్ టాపిక్

సాధారణంగా హైవేపై వెళుతుంటే టోల్‌ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఆ టోల్‌ గేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి?.. వాటి ఫీజు ఎంత?.. అన్న విషయాలు మనకు తెలియదు.

టెక్ టాపిక్

అయితే, ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ముందు రాబోయే టోల్‌ గేట్‌లో ఎంత ఫీజు వసూలు చేస్తారో తెలుసుకోవచ్చు.

టెక్ టాపిక్

అయితే, ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ముందు రాబోయే టోల్‌ గేట్‌లో ఎంత ఫీజు వసూలు చేస్తారో తెలుసుకోవచ్చు.

టెక్ టాపిక్

ప్రసుత్తం ఈ టోల్‌ ఫీచర్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో అందుబాటులో ఉంది.

టెక్ టాపిక్

ఇండియా, అమెరికా, జపాన్‌, ఇండినేషియాల్లోని 2000వేల టోల్‌ రోడ్సులో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

టెక్ టాపిక్

రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలకు ఈ సదుపాయాన్ని విస్తరించే విధంగా గూగుల్‌ ప్రణాళికలు రచిస్తోంది.

మరి, గూగుల్‌ మ్యాప్స్‌ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.