ప్రస్తుతం ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి.
ఒక నిండు గర్భిణీ పరీక్షకు హాజరైంది.
అయితే పరీక్ష రాస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.
ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
కొత్తవలసకు చెందిన ఓ వివాహిత (22) పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాసేందుకు హాజరైంది.
ఆమె 9 నెలల నిండు గర్భిణీ కావడంతో పరీక్ష రాస్తుండగా హఠాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి.
ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువవడంతో కళాశాల ప్రిన్సిపాల్ 108కి కాల్ చేశారు.
వెంటనే అంబులెన్స్ రావడంతో ఆమెను పార్వతీపురం జిల్లా హాస్పిటల్ కు తరలించారు.
ఆమె వెటర్నరీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుందని, ఆ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ అర్హత ఉండాలంటే పరీక్ష రాయడానికి వచ్చిందని ఆమె భర్త అన్నారు.
ఈ పరీక్షలు తమకు చాలా ముఖ్యమని, అందుకే 9 నెలల కడుపని తెలిసి కూడా తన భార్యను పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చానని ఆమె భర్త వెల్లడించారు.
అయితే పరీక్ష రాయకుండానే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది.
వెటర్నరీ ఉద్యోగం కోసం కష్టమైనా పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. కానీ ఇంతలోనే ఇలా జరిగింది.