ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ ఆర్గనైజేషన్‌.. దీని గురించి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పరిచయమే.

గతంలో అయినా పీఎఫ్‌ వద్దనుకుంటే కొన్ని కంపెనీలు వెసులుబాటు కల్పించేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం పీఎఫ్‌ని తప్పనిసరి చేయడంతో దాదాపు అందరు ఉద్యోగులు అంతా ఈ పీఎఫ్‌ చందాదారులుగా ఖాతాలు కలిగి ఉన్నారు.

అయితే నిన్న మొన్న ఖాతాలు పొందిన వారికి కాదుగానీ, కాస్త పాతవారికి మాత్రం ఇప్పుడు ఒక శుభవార్త చెప్పబోతున్నాం. నిజానికి ఇది దీపావళి శుభవార్తగా కూడా చూడచ్చు.

ప్రభుత్వం ఈపీఎఫ్‌వో ఖాతాదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు వడ్డీ నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

8.1 శాంత వడ్డీని చందాదారులకు చెల్లించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ నెలాఖరకు వడ్డీని ఖాతాదాహరుల ఖాతాల్లో జమ చేస్తారని చెబుతున్నారు.

అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న వడ్డీని కూడా లెక్కించి ఖాతా జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వడ్డీ మాత్రం 40 ఏళ్ల కనిష్టంగా ఉందంటూ చెబుతున్నారు.

ప్రభుత్వం చెప్పిన వడ్డీ శాతం ప్రకారం.. మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.10 లక్షలు ఉంటే మీకు గరిష్టంగా రూ.81 వేలు వడ్డీ కింద లభిస్తాయి.

అదే మీ పీఎఫ్‌ ఖాతాలో 7 లక్షలు ఉంటే.. రూ.56,700 వడ్డీగా లభిస్తుంది. మీ పీఎఫ్‌ ఖాతాలో 5 లక్షలు ఉంటే మీకు.. రూ.40,500 వడ్డీ వస్తుంది.

అదే మీ ఖాతాలో కేవలం లక్ష రూపాయలే ఉంటే మీకు వడ్డీ కింద రూ.8,100 లభిస్తుందని చెబుతున్నారు. అయితే చాలా మందికి ఈపీఎఫ్‌వో ఖాతాని ఎలా ఓపెన్ చేయాలి? పాస్‌ బుక్‌ బ్యాలెన్స్‌ ఎలా చూసుకోవాలి అనేది తెలియదు.

అసలు మీ పీఎఫ్‌ ఖాతాని ఎలా ఓపెన్‌ చేయాలో ఇప్పుడు చూద్దాం. EPFOINDIA వెబ్ సైట్ లో లాగిన్ అయిన తర్వాత అవర్ సర్వీసెస్ అని ఆప్షన్ ఉంటుంది.

దానిని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ వస్తుంది. అందులో ఉద్యోగుల కోసం అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి. ఆ తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్ వస్తుంది.

దానిలో ఖాతాదారుని పాస్ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేశాక మీకు సైన్ ఇన్ ఇంటర్ ఫేస్ కనిపిస్తుంది. దానిలో మీ UAN నంబరు, పాస్ వర్డ్ కొట్టి సెక్యూరిటీ కోసం ప్రశ్న అడుగుతారు.

అది రాసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయాలి. అలా చేసిన తర్వాత మీకు మీ ఖాతా పాస్ బుక్ లో ఎంత మొత్తం ఉంది అనేది కనిపిస్తుంది.

అంతేకాకుండా మొబైల్‌ ఎస్‌ఎమ్మెస్‌ ద్వారా కూడా మీరు మీ పీఎఫ్‌ ఖాతా మొత్తాన్ని తెలుసుకోవచ్చు.

“EPFOHO UAN ENG” అని టైప్‌ చేసి 77382 99899కి మీ రిజిస్ట్రడ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి మెసేజ్‌ పంపగానే మీకు మీ పీఎఫ్‌ ఖాతా మొత్తం ఎంతో రిప్లై వస్తుంది.

అదే మీకు తెలుగులో కావాలని కోరుకుంటే.. “EPFOHO UAN TEL” అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది.