ఏదైనా ప్రమాదం జరగబోతుందని తెలిసి.. ఆపే ప్రయత్నం చేసే వాళ్లు చాలా మంది ఉంటారు.

అయితే తమకు ఆరోగ్యం బాగాలేకున్న, ప్రాణాలకు ముప్పు వస్తుందన్న ముందుకెళ్లే వాళ్లు తక్కువగా ఉంటారు.

తమ ప్రాణాలకు ముప్పుని తెలిసిన కూడా తెగించే వాళ్లు నూటికి ఒక్కరు ఉంటారు.

ఆ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటకకు చెందిన 70 ఏళ్ల చంద్రావతి  అనే వృద్ధురాలు.

కర్ణాటకలోని  మందార అనే ప్రాంతంలో  చంద్రావతి అనే 70 ఏళ్ల బామ్మ నివాసం ఉంటుంది.

ఇటీవలే ఆమెకు గుండె ఆపరేషన్ చేయించడంతో విశ్రాంతి తీసుకంటున్నారు.

అతిగా నడిచిన, పరిగెత్తిన ప్రాణాలకే ముప్పుని వైద్యులు తెలిపారు.

అయితే తన ప్రాణాలకు ముప్పుని తెలిసిన కూడా  రైలు ప్రమాదాన్ని తప్పించారు.

మందార ప్రాంతంలో  రైలు ట్రాక్ పై పెద్ద వృక్షం పడిపోయింది.

అదే సమయంలో అటుగా మత్సగంధ రైలు వస్తుందనే విషయం బామ్మకు గుర్తుకు వచ్చింది.

చెట్టు విరిగిన సమాచారాన్ని ఎవరికైనా  ఫోన్ చేసి చెబుదామని ఆమె  ఇంట్లోకి వెళ్లింది.

అయితే ఇంతలోనే రైలు హారన్ వినిపించడంతో ఆమె కంగారు పడిపోయింది.

తన ఇంట్లోని ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని రైలు ఎదురుగా చాలా దూరం పరుగులు తీసింది.

తన గుండెకు ఆపరేషన్ జరిగిన విషయాన్ని కూడా మరచి..  రైలు వైపు పరుగులు తీసింది.

ఆ వృద్ధురాలిని గమనించిన లోకో ఫైలట్ రైలు వేగాన్ని తగ్గించి ఆపేశాడు.  

అనంతరం స్థానికులు, రైల్వే సిబ్బంది పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు.

పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు బామ్మను అభినందించారు.