ముఖ్యంగా కిచెన్, ఆహార పదార్థాలు, తీపి వస్తువులు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి.
ఇక ఈ చీమల బారి నుంచి బయట పడడానికి మనం అనేక రకాల స్ప్రేలు వాడుతాము.
అయినా వాటి సమస్య పరిష్కారం కాక విసుగెత్తిపోతుంటారు.
బారి నుంచి తప్పించుకోవడానికి చక్కని చిట్కాలను ఉన్నాయి.
ఈ చిట్కాల కోసం ఎటువంటి రసాయనాలను వాడే అవసరం లేదు.
కేవలం వంటగదిలోని పదార్థాలను సరిగ్గా వాడితే.. ఈ చీమల సమస్యను తప్పించుకోవచ్చు.
చీమల్ని తరిమి కొట్టడానికి నల్ల మిరియాలు మెరుగ్గా సహాయపడతాయి.
మిరియాల నుంచి వచ్చే ఘాటుకు చీమలు పారిపోతాయి. కాబట్టి కిచెన్ లో అక్కడక్కడా పెడితే చాలు.
రెండు కప్పుల నీళ్లలో కొంచెం పెప్పర్‌మెంట్ ఆయిల్‌ను కలిపి ఒక బాటిల్లో నింపులు కోవాలి.
ఆ నీటిని పోసి చీమలు ఉన్నచోట స్ప్రే చేస్తే .. వాటి బెదడ తప్పితుంది.
అయితే ఆ నీటిని స్ప్రే చేసేటప్పుడు ఇంట్లో ఉండే పెట్స్‌ని దూరంగా ఉంచాలి.
కాటన్ బాల్స్‌ని ఆ నీటిలో ముంచి కిచెన్‌లో ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.
చీమల నుంచి ఉపశమనం పొందడానికి దాల్చిన చెక్క కూడా సహాయపడుతుంది.
వేప నూనెను రెండు కప్పుల నీటిలో వేసి.. స్ప్రే చేసినా చీమలకు చెక్ పెట్టవచ్చు.