అన్ని సీజన్‌లతో పోలిస్తే.. శీతాకాలంలో జబ్బులు బారిన పడే అవకాశం కాస్త అధికం.
జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచుగా తలెత్తుతాయి. అందుకే శీతాకాలంలో అధిక జాగ్రత్తలు అవసరం అంటున్నారు నిపుణులు.
ఇక అందరితో పోలిస్తే.. గర్భిణీలు శీతాకాలంలో మరింత్ర జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
గర్భధారణ సమయంలో సాధారణంగా మహిళల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు.
కనుక గర్భిణీ స్త్రీలు.. శీతాకాలంలో ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడం మేలని.. సెంటర్ ఫర్ డీసిజ్ కంట్రోల్ సూచించింది.
ఇక చలికాలంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
అందుకే కూరగాయలు, అల్లం, బాదం, పెరుగు, వెల్లుల్లిరెడ్ బెల్ పెప్పర్స్, బ్రొకోలీ మొదలైన వాటిని గర్భిణీ స్త్రీలు ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భధారణ సమయంలో శరీరం సున్నితంగా ఉంటుంది. కనుక వారు ఎక్కువ దుమ్ము, క్రిములు ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
శీతాకాలంలో సహాజంగానే నీరు తాగడం తగ్గిస్తాం. కానీ చలికాలంలోనే శరీరానికి నీరు ఎక్కువ అవసరం.
కనుక రోజులో సరిపడా నీరు తాగాలి. దాంతో పాటు.. టీ, సూప్, పళ్ల రసాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
సాధారణంగా చలికాలంలో బద్దకంగా అనపిస్తుంది. అయితే దాన్నుంచి బయటపడి.. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
కనుక గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహాతో.. తేలికపాటి వ్యాయమాలు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు.
చలికాలంలో ఎవరికైనా సరే.. చర్మం త్వరగా పొడిబారుతుంది. కాబట్టి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
శీతాకాలంలో చర్మ సంరక్షణ కోసం కొబ్బరినూనెను ఉపయోగించండి. అలానే తరచూ క్రీమ్ రుద్దుకోవాలి.
గర్భధారణ తర్వాత సహజంగానే స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. చర్మం డ్రైగా మారితే స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కనుక అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుని.. ఆరోగ్యంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.