దేశంలోనే ప్రముఖ రిటైల్ సంస్థగా పేరుగాంచిన శరవణ స్టోర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరవణన్ సెల్వరత్నమ్ కుమారుడే  అరుళ్ శరవణన్

1970 జులై 10న చెన్నైలో జన్మించారు. 

డిగ్రీ వరకు చదివిన ఆయన తండ్రి వారసత్వంగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 

శరవణ స్టోర్స్ ఉత్పత్తులన్నింటికీ ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు.

ప్రముఖ నటీమణులు తమన్నా, హన్సికలతో చేసిన ప్రకటనల్లో ఆయన మెరిశారు. 

వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాక మోడల్ గా కూడా రాణించారు. 

50 ఏళ్ల వయసు వచ్చే వరకు వ్యాపార రంగంలోనే కొనసాగారు

నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. అందుకోసం ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ కూడా పొందారు.

ది లెజెండ్’ అనే సినిమా ద్వారా తమిళ, తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు

ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతాలా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు

అరుళ్ భార్య పేరు సూర్యశ్రీ

వీరికి ఇద్దరు కుమార్తెలు.  ఒక కుమారుడు

ఆయన సోదరి వివాహానికి 13 కోట్ల విలువైన వస్తువులు ఇచ్చి వార్తల్లో నిలిచారు

ప్రస్తుతం ఆయన మరో సినిమాతో పలకరించబోతున్నారని సమాచారం