ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలను, కనీస సదుపాయాలు లేనటువంటి గ్రామాలను.. కేంద్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతుంది.
ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు కేటాయిస్తోంది.
విద్య, వైద్యంతో పాటు సురక్షిత తాగు నీరు, విద్యుత్ కనెక్షన్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
సాధారణంగా ఉన్న గ్రామాలను అసాధారణ గ్రామాలుగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తుంది.
మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా ఉపాధి శిక్షణ కూడా ఇచ్చి.. వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందిస్తారు.
ఈ పథకం కింద గ్రామం ఎంపిక అయితే.. ఆ గ్రామంలో ఇంటింటికీ తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్, రోడ్లు, డ్రైనేజ్ లు వంటివి ఏర్పాటు చేస్తారు. ఊరికో పోస్టాఫీస్ పెడతారు.
గ్రామంలో బ్యాంకు ఉంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు. బ్యాంకు లేకపోతే బ్యాంకు పర్సన్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందిస్తారు.
చిన్న పిల్లలు అందరూ బడికి వెళ్లేలా పర్యవేక్షిస్తారు. పెద్దలకు, యువతకు ఉపాధి శిక్షణ ఇస్తారు.
శిక్షణ పూర్తయ్యాక దానికి తగ్గట్టు పని కల్పిస్తారు. లేదా స్వయం ఉపాధి చేసుకునేలా బ్యాంకులో రుణాలు వచ్చేలా చేస్తారు.
ఇక ఇల్లు లేనివారికి ఇల్లు మంజూరు చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చూస్తారు.
రూ. 20 లక్షల గ్రామాభివృద్ధి కోసం, లక్ష రూపాయలు పరిపాలన, నిర్వహణ ఖర్చుల కోసం మంజూరు చేస్తారు.
ఈ పథకం కింద ఇప్పటి వరకూ 2,487 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
ఈ పథకంలో చేరాలంటే మీ గ్రామంలో షెడ్యూల్ కులాల వారు 50 శాతానికి పైగా ఉండాలి.