ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? పది పాసయ్యారా? ఇంటర్ పూర్తి చేశారా? డిగ్రీ అర్హత కలిగి ఉన్నారా?

అయితే మీ అర్హతకు తగ్గ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే ఎదురుచూస్తుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా 5369 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్

అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్ టైల్ డిజైనర్ సహా పలు రకాల పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: పదవ తరగతి పాసై ఉండాలి. లేదా ఇంటర్ లేదా డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతను బట్టి పోస్టు ఉంటుంది.

వయసు పరిమితి: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

వయసు సడలింపు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 05 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు: 03 ఏళ్ళు

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ. 100

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 06 2023

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 27 2023

ఆన్ లైన్ ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: మార్చి 28 2023 రాత్రి 11 గంటల వరకూ

చలానాతో పేమెంట్ చేయడానికి ఆఖరు తేదీ: మార్చి 29 2023

దరఖాస్తు ఫారం సవరణలు చేసుకోవడానికి ఆఖరు తేదీ: 03.04.2023 నుంచి 05.04.2023 రాత్రి 11 గంటల వరకూ

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: జూన్-జూలై 2023