ఇండియన్ రైల్వేస్ మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1785 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు వర్క్ షాప్స్ లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, కార్పెంటర్, పెయింటర్, కేబుల్ జాయింటర్ సహా పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

దరఖాస్తు ఆన్ లైన్ లో చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.

యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వారీగా ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హత: పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.

అర్హత: ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ జారీ చేసిన సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయసు పరిమితి: జనవరి 01 2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు: రూ. 0/- ఇతర అభ్యర్థులకు: రూ. 100/-

దరఖాస్తు చివరి తేదీ: 02/02/2023 సాయంత్రం 5 గంటల వరకూ