ఇంటర్వ్యూ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం మీ కోసం.

భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 295 జూనియర్ ఓవర్ మ్యాన్: 82 మైనింగ్ సర్దార్: 145 సర్వేయర్: 68 

జీతాలు: జూనియర్ ఓవర్ మ్యాన్: నెలకు రూ. 31,852.56/- మైనింగ్ సర్దార్: నెలకు రూ. 31,852.56/- సర్వేయర్: నెలకు రూ. 34,391.65/-

జూనియర్ ఓవర్ మ్యాన్ పోస్టుకి ఉండాల్సిన అర్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్ లో 3 ఏళ్ల డిప్లోమా లేదా డిగ్రీ చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. 

మైనింగ్ సర్దార్ పోస్టుకి ఉండాల్సిన అర్హతలు: సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్ (10+2) అర్హత ఉండాలి. లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

సర్వేయర్ పోస్టుకి ఉండాల్సిన అర్హతలు: సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్ (10+2) అర్హత ఉండాలి. లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయసు పరిమితి: 23/01/2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. 

అభ్యర్థుల ఎంపిక: కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ//మహిళా అభ్యర్థులకు: రూ. 0/- జనరల్ (యుఆర్)/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 1180/-

దరఖాస్తు ప్రారంభ తేదీ: 03/01/2023 ఉదయం 10 గంటలకు

దరఖాస్తు చివరి తేదీ: 23/01/2023 రాత్రి 11.50 వరకూ