హైదరాబాద్ లో గజం స్థలం కొనాలంటే కనీసం రూ. 50 వేలు పెట్టాల్సిందే.

100 గజాలు కొనాలంటే రూ. 50 లక్షలు పై మాటే.

హైదరాబాద్ లో స్థలం కొనడం గగనం అని చెప్పి చాలా మంది ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్లో కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

పటాన్ చేరు, శంకరపల్లి, జహీరాబాద్ తదితర ప్రాంతాల వైపు వెళ్లిపోతున్నారు.

హైదరాబాద్ ఇప్పుడు అన్ని దిశల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో శివారు ప్రాంతాల భూములకు రెక్కలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో రియల్ ఎస్టేట్ మొదలైంది.

ఈ ఏరియాల్లో ప్రస్తుతం స్థలాల ధరలు తక్కువగా ఉన్నాయి.

నిమ్జ్ కి సమీపంలో ఉండడంతో ఈ ఏరియాల్లో స్థలాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.

ఇప్పుడు స్థలం కొని పెట్టుకుంటే భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

ఇల్లు కట్టుకోవడానికైనా, రేటు పెరిగినప్పుడు అమ్మడానికైనా ఈ ఏరియాలు ఉత్తమ ఛాయిస్ అని చెబుతున్నారు.

2 బీహెచ్కే ఇంటికి సరిపడా స్థలం కోసం కనీసం 1000 చదరపు అడుగుల జాగా ఉండాలి.

ఈ ఏరియాల్లో గజం రూ. 3500 నుంచి మొదలై 7 వేలు, 8 వేలు, 9 వేలు రేంజ్ లో ఉన్నాయి.     

గరిష్టంగా రూ. 10 వేలు, 11 వేలు,15 వేలు రేంజ్ లో ఉన్నాయి.

100 గజాల స్థలం కావాలంటే తక్కువలో తక్కువ రూ. 3,50,000 అవుతుంది.

144 గజాల స్థలం అంటే 3 సెంట్లు ఐతే కనీసం రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలు అవుతుంది.